The Taj Story OTT: ప్రపంచ అద్భుతాలలో ఒకటైన తాజ్‌మహల్ గురించి మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మన స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లోనూ, టూరిజం గైడ్లు చెప్పిన విషయాల ప్రకారం అది అద్భుతమైన ప్రేమ ప్రతీక మాత్రమే అని అనుకుంటున్నాము. కానీ, ఆ చారిత్రక కట్టడం వెనుక ఎవరికీ తెలియని నిజాలు, డార్క్ సీక్రెట్స్ దాగున్నాయంటే నమ్ముతారా ? సరిగ్గా ఇదే పాయింట్ ను బేస్ చేసుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక సంచలన కథతో తెరకెక్కిన సినిమానే ‘ది తాజ్ స్టోరీ’ (The Taj Story). ఈ సినిమా డిజిటల్ సర్కిల్స్‌లో రిలీజ్‌కు ముందే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఇలాంటి సంచలన మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగు ఆడియో ఆప్షన్ ఉందా ? అనే వివరాల్లోకి వెళ్తే…
లోకల్ టూరిస్ట్ గైడ్ విష్ణు దాస్ ఇందులో మెయిన్ రోల్. తాజ్ మహల్ చరిత్రకు సంబంధించి తనకు ఎదురైన కొన్ని వింత అనుమానాలు, లోతైన ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలు పెడతాడు. ఆ రీసెర్చ్ క్రమంలో అతను కనుగొనే షాకింగ్ నిజాలు కేవలం చరిత్రను మాత్రమే కాకుండా, అందరి ఆలోచనా విధానాన్ని ఒక్కసారిగా కుదిపేస్తాయి. ఆ తర్వాత ఆ చిన్న అనుమానం కాస్తా పెద్ద వివాదంగా మారి కోర్టు మెట్లు ఎక్కుతుంది. అక్కడ జడ్జి ముందు జరిగే వాదనలు, లాయర్ల మధ్య జరిగే మాటల యుద్ధం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయి.
విష్ణు దాస్ జీవితంలో ఈ వివాదం అనుకోని మలుపు తీసుకొస్తుంది. తాజ్ మహల్ చరిత్రపై తనకు ఉన్న అభిప్రాయాలను బయట పెట్టిన తర్వాత అతడి వ్యక్తిగత జీవితం, కుటుంబం కూడా ఈ పరిణామాల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిరూపించుకోవాలంటే ఆధారాలను తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన వాదనలను కోర్టులో వినిపిస్తూ, ఎదురుగా ఉన్న న్యాయవాదుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది.
ఒక సాధారణ వ్యక్తి దేశాన్ని కదిలించే చారిత్రక అంశంపై ఒంటరిగా పోరాటం చేయడం, మరోవైపు పవర్ ఫుల్ లాయర్లతో జరిగే కోర్టు రూమ్ డ్రామా ఈ చిత్రంలో మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. మరి ఇంతకీ అతను ఈ ఒంటరి పోరాటంలో గెలిచాడా ? అసలు తాజ్ మహల్ గురించి అతను చేసే ఆరోపణలు ఏంటి ? కోర్టులో ఏం జరుగుతుందో తెలియాలంటే సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.
‘ది తాజ్ స్టోరీ’ జియో హాట్‌స్టార్ (JioHotstar)లో అందుబాటులో ఉంది. హిందీతో పాటు తెలుగు వెర్షన్‌లోనూ ఈ కోర్టు రూమ్ డ్రామాను చూడొచ్చు. సీనియర్ నటుడు పరేష్ రావల్ తన అద్భుతమైన, సహజమైన నటనతో ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. జాకీర్ హుస్సేన్ (Zakir Hussain), నమిత్ దాస్ (Namit Das), అమృతా ఖాన్విల్కర్ (Amruta Khanvilkar), స్నేహా వాఘ్ (Sneha Wagh) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తుషార్ అమ్రిష్ గోయెల్ (Tushar Amrish Goel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చరిత్ర పుస్తకాలలో ఎక్కడా చదవని సరికొత్త కోణాన్ని, డీప్ రీసెర్చ్ పాయింట్స్ ను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ మూవీలో… తాజ్‌మహల్ చరిత్రపై వివాదాస్పద వాదనలను కూడా చూపించారు.
Read Also: లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ