E-Paper
Advertisement

వామ్మో ఆసిన్ కుమార్తెకు ఇలాంటి టాలెంట్ ఉందా? సూపర్ కిడ్ అంటూ!

వామ్మో ఆసిన్ కుమార్తెకు ఇలాంటి టాలెంట్ ఉందా? సూపర్ కిడ్ అంటూ!
Advertisement

Asin Daughter: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆసిన్(Asin) ఒకరు. గజిని అమ్మానాన్న ఓ తమిళమ్మాయి వంటి సూపర్ హిట్ సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఆసిన్ పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతూ తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈమె రాహుల్ శర్మ(Rahul Sharma) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈయన మైక్రో మ్యాక్స్ కో ఫౌండర్ గా పనిచేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత ఆసిన్ సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

12 భాషలు అనర్గళంగా మాట్లాడగలరు..

ఇదిలా ఉండగా తాజాగా ఆసిన్ భర్త రాహుల్ శర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన కుమార్తె అరిన్ రేన్ శర్మ (arin rayn sharma)గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తమ కుమార్తెకు ప్రస్తుతం ఏడు సంవత్సరాల వయసు అని తెలిపారు. అయితే ఇంత చిన్న వయసులోనే ఆమె ఏకంగా 12 భాషలను మాట్లాడగలరని తెలిపారు. విదేశీ భాషలు కూడా అనర్గళంగా మాట్లాడుతుందని, తనకు ఆసిన్ ఇద్దరికీ రెండు భాషలు మాట్లాడటమే కష్టం మేమిద్దరం ఇంగ్లీష్ హిందీ వరకు మాత్రమే పరిమితమయం కానీ తమ కూతురు మాత్రం 12 భాషలు మాట్లాడుతుందని తెలిపారు.

ఇప్పటివరకు మొబైల్ ఇవ్వలేదు..

Advertisement

ప్రస్తుతం తన కుమార్తె రెండో తరగతి చదువుతున్న కూడా ఆమెకు ఎనిమిది తొమ్మిది తరగతి పుస్తకాలు కూడా మా ఇంట్లో ఉన్నాయని తెలిపారు. అయితే తన కుమార్తె ఇంత చిన్న వయసులోనే ఇలాంటి టాలెంట్ పొందడానికి కారణం మా ఇంట్లో ఇప్పటివరకు సెల్ ఫోన్, టీవీ ఆమెకు చూపించకపోవటమే కారణమని తెలిపారు. ఇలా తనకు టీవీ మొబైల్ కంటే కూడా ఎక్కువగా పుస్తకాలను అలవాటు చేశామని మా ఇల్లు మొత్తం ఒక లైబ్రరీ లాగా పుస్తకాలతో నిండి పోయిందని తెలిపారు.

ఆసిన్ ను పెళ్లి చేసుకోవడం అదృష్టం..

తన కుమార్తె ఇంత మంచి టాలెంట్ కలిగి ఉండడానికి తన భార్య ఆసిన్ కారణమని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం ఆసిన్ కు దక్కుతుందని రాహుల్ శర్మ తెలిపారు. ఇక ఈయన ఆసిన్ గురించి కూడా మాట్లాడుతూ తాను తన జీవితంలో ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అంటే అది ఆసిన్ ను పెళ్లి చేసుకోవడమేనని తెలిపారు.క్లిష్ట పరిస్థితుల్లో తన వెన్నంటి నిలిచి, నిరంతరం ప్రోత్సహించే శక్తి ఆసిన్ అని కొనియాడారు. ఆమె అండగా ఉండటం వల్లే వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను సులువుగా ఎదుర్కోగలుగుతున్నానని చెప్పారు. ఇలా రాహుల్ శర్మ తన కుమార్తె టాలెంట్ గురించి ఈ సందర్భంగా మాట్లాడటంతో ఆసిన్, రాహుల్ తమ కూతురిని చాలా అద్భుతంగా పెంచుతున్నారని, గ్రేట్ పేరెంటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Also Read: థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2?

Related News

కిరణ్ అబ్బవరం ‘భజగోవిందం’ సాంగ్ పై ఏపీ సీఎం ప్రశంసలు.. రియాలిటీ పై పెరిగిన బజ్!

విజయ్ పై భారీ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మిక!

ఏందయ్యా స్వామి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. విరోష్ కెమిస్ట్రీ అదుర్స్!

ఏంటీ.. ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేష్ దొంగా? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

ప్రాణభయంతో సొంత ఇంటిని అమ్మేసిన టైగర్ ష్రాఫ్.. ఎన్ని కోట్లంటే?

చిక్కుల్లో ఫౌజీ సినిమా.. నేతాజీ మనవడు ఏమన్నారంటే?

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?

Big Stories

Advertisement
×