Aadarsha Kutumbham Movie: విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbham). ఇప్పటివరకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)సినిమాలు చేశారు కానీ వెంకటేష్(Venkatesh) తో ఇది మొదటి సినిమా కావటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. శ్రీనివాస్ ఇదివరకు వెంకటేష్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు కానీ ఆయన దర్శకుడిగా పనిచేయడం ఇది మొదటిసారి. ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే అక్టోబర్ 30 వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ సినిమాపై అనుకున్న స్థాయిలో బజ్ ఏర్పడలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ అభిమానులు ఈ సినిమా విషయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేశారు అదేవిధంగా ఈ సినిమాకు 2:29 నిమిషాల రన్ టైం కూడా లాక్ చేశారు.
ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం(AP Government) నుంచి కూడా చిత్రానికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క సినిమాకి టికెట్ల రేట్లు పెంచుతూ జిఓ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదర్శ కుటుంబం నిర్మాతలు సైతం టికెట్లు రేట్లు పెంచమని కోరుతూ ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో ఏపీ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ(Ticket Price Hike) ఉత్తర్వులు జారీ చేసింది. మరి పెరిగిన సినిమా టికెట్ ధరలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే.. ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీ విడుదల అయితే 8వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతి తెలిపింది.
ఇక ఈ సినిమాకు మల్టీప్లెక్స్ లలో రూ. 75 రూపాయలను పెంచగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 జీఎస్టీలతో కలిపి టికెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ జీవో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంకటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి 30 న రాబోతున్న ఆదర్శ కుటుంబం సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా శ్రీనిధి శెట్టి నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
Also Read: విజయ్ రష్మిక పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్!