Paper Straws: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌కు బదులు పేపర్ వైపు అడుగులు వేస్తున్నాం.. కానీ ప్రత్యామ్నాయం ఎప్పుడూ పర్యావరణహితమేనా? దక్షిణ కొరియా ప్రభుత్వ అధ్యయనం ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. సంప్రదాయ ప్లాస్టిక్ స్ట్రాలతో పోలిస్తే పేపర్ స్ట్రాల క్యాన్సర్ సంబంధిత పర్యావరణ ప్రభావ సూచిక 6.33 రెట్లు ఎక్కువగా నమోదైంది. పర్యావరణ యాసిడిఫికేషన్ ఎఫెక్ట్ కూడా 2.04 రెట్లు అధికంగా ఉన్నట్లు స్టడీ తెలిపింది.
బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ స్ట్రాల్లోనూ ఈ రికార్డులు ఎక్కువగానే నమోదయ్యాయి. మొత్తం 16 పర్యావరణ విభాగాల్లో పరిశీలించగా.. 10 విభాగాల్లో సంప్రదాయ ప్లాస్టిక్ స్ట్రాలు తక్కువ ప్రభావాన్ని చూపాయి. అయితే ఈ గణాంకాలు పేపర్ స్ట్రాలు వాడితే క్యాన్సర్ వస్తుందని అర్థం కాదు. తయారీ నుంచి పారవేత వరకు ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ లో పర్యావరణంపై పడే ప్రభావాన్ని సూచిస్తాయి. ప్లాస్టిక్ వద్దనడం ఎంత ముఖ్యమో.. ప్రత్యామ్నాయం ఎంత సురక్షితమో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం! పర్యావరణహితం అనే లేబుల్ చూసి కాదు.. శాస్త్రీయ ఆధారాలు చూసి నిర్ణయం తీసుకోవాలి.
Also read: అమ్మా నువ్వే చేయించుకో… సీతమ్మ పాత్ర చేయడం పై సాయి పల్లవి కామెంట్స్!