E-Paper
Advertisement

ఏపీ ప్రభుత్వంపై గుర్రుమంటున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎఫ్‌డీసీ ఛైర్మన్ నియామకంపై..

ఏపీ ప్రభుత్వంపై గుర్రుమంటున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎఫ్‌డీసీ ఛైర్మన్ నియామకంపై..
Advertisement

APFDC Chairman: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్ సంబంధాలను సమన్వయం చేసే కీలకమైన పదవి APFDC ఛైర్మన్. ఈ పదవికి భరత్ భూషణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో, పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

READ ALSO-ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ వచ్చేది ఎప్పుడంటే?

అనుభవమా..అదృష్టమా?

Advertisement

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పదవికి దిల్ రాజు వంటి అనుభవజ్ఞుడు ఉండాలని మెజారిటీ నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకు అంటే.. డిస్ట్రిబ్యూటర్‌గా మొదలై స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన ప్రస్థానం. థియేటర్ల నిర్వహణ, ఎగ్జిబిషన్ సిస్టమ్, పంపిణీ రంగంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. టికెట్ ధరలు, జీవోలు, షూటింగ్ అనుమతుల విషయంలో ప్రభుత్వంతో సమర్థవంతంగా చర్చించగలరనే నమ్మకం ఒక వైపు అయితే. మరోవైపు, భరత్ భూషణ్ కేవలం డిస్ట్రిబ్యూటర్‌గా, కొన్ని చిన్న చిత్రాల ప్రొడక్షన్‌లో మాత్రమే సంబంధం కలిగి ఉన్నారని, ఇంత పెద్ద బాధ్యతను నిర్వహించే స్థాయి ఆయనకు లేదన్నది సీనియర్ల వాదన.

వివాదానికి కారణం..

APFDC ఛైర్మన్ నియామకంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో రాకముందే భరత్ భూషణ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తడం ఇండస్ట్రీ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఇది ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. పేరు ఖరారు అయిందని ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా చేసే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.

సీనియర్ నిర్మాతలు ఏం అంటున్నారు..

Advertisement

ఎఫ్‌డీసీ ఛైర్మన్ పదవి కేవలం రాజకీయ నియామకం మాత్రమే కాదు. పరిశ్రమ భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాల సమస్యలను ప్రభుత్వానికి వివరించడంలో పట్టుండాలి. అనుభవం లేని వ్యక్తి పదవిలోకి వస్తే, కీలక చర్చల సమయంలో ఇండస్ట్రీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రభుత్వం పరిశ్రమ మధ్య గ్యాప్ పెరిగే ప్రమాదం ఉందని సీనియర్ నిర్మాతలు భయపడుతున్నారు. ప్రస్తుతానికి భరత్ భూషణ్ పేరు రేసులో ముందున్నప్పటికీ, అధికారిక ముద్ర పడలేదు. సాధారణంగా ప్రభుత్వం ఇండస్ట్రీలోని కీలక వ్యక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి సరైన వ్యక్తిని ఛైర్మన్ గా ఎంచుకోవాలని టాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు.

Read also-రామ్ చరణ్‌కు ‘రంగస్థలం’ స్థాయిని అందుకోవడం సాధ్యమేనా?.. ‘పెద్ది’పై ఫ్యాన్స్ ఆందోళన!

ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా లేక ఇండస్ట్రీ పెద్దల మాటకు విలువిచ్చి నిర్ణయం మారుస్తుందా అనేది వేచి చూడాలి. భరత్ చౌదరికి కొన్ని రంగాల్లో అనుభవం ఉన్నప్పటికీ సీనియర్ నిర్మాతలకు ఆయన నియామకం నచ్చడంలేదు. ఏది ఏమైనా ప్రభుత్వానిదే తుది నిర్ణయం కావడంతో ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన జీవో కోసం తెలుగు నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

Related News

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×