E-Paper
Advertisement

దేశవ్యాప్తంగా నీట్-2026 పరీక్ష రద్దు.. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ, త్వరలో కొత్త షెడ్యూల్

దేశవ్యాప్తంగా నీట్-2026 పరీక్ష రద్దు.. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ, త్వరలో కొత్త షెడ్యూల్
Advertisement

NEET-UG 2026 Cancel: పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి నీట్-యూజీ 2026 రద్దయ్యింది. మే మూడున నీట్ యూపీ పరీక్ష జరిగింది. ఆ పరీక్షను రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. పరీక్షా పేపర్ లీక్‌పై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. పరీక్షకు సంబంధించి కొత్త షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.

దేశవ్యాప్తంగా నీట్-2026 పరీక్ష రద్దు

Advertisement

వైద్య విద్యకు సంబంధించి దేశవ్యాప్తంగా మే నెల మూడున నీట్ -2026 ప్రవేశ పరీక్ష జరిగింది. ఆ పరీక్షకు సంబంధించి రాజస్థాన్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో పరీక్షకు ముందే పేపర్ ఎలా సర్క్యులేట్ అయింది? దీనివెనుక ఏమైనా ముఠాలు ఉన్నాయా? అన్నకోణంలో లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విచారణకు అవసరమైన అన్నిరికార్డులను సీబీఐకి అందజేస్తామని ఎన్టీఏ పేర్కొంది.

Advertisement

త్వరలో కొత్త షెడ్యూల్.. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ 

మే మూడున నీట్‌ యూజీ-2026 పరీక్ష కెమిస్ట్రీ లో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించారు రాజస్థాన్ పోలీసులు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ అదనపు డీజీపీ విశాల్‌ బన్సాల్, ఎస్‌ఓజీ అధికారులు స్వయంగా వెల్లడించారు. పరీక్షకు 42 గంటల ముందు ఆ పేపర్ రాజస్థాన్‌లోని సికార్‌లో వాట్సాప్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు.

నీట్‌ ప్రశ్నాపత్రంలో 600 మార్కుల ప్రశ్నలతో ఆ పేపర్ పోలి ఉంది. కొన్ని ప్రశ్నలు ఒకేలా ఉండడం పలు అనుమానాలు మొదలయ్యాయి. ఆ ప్రాక్టీసు పేపరు కేరళలోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. సదరు వ్యక్తి ఈనెల ఒకటిన సికార్‌లోని తన ఫ్రెండ్‌కి దానికి సంబంధించిన మెటీరియల్‌ ఇచ్చాడని తెలుస్తోంది.

ఆ పేపర్ కాస్త కోచింగ్‌ నెట్‌వర్క్‌లు, కెరీర్‌ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరింది. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి 300లకు ప్రశ్నలు చేతి రాతతో ఉన్నట్లు తేలింది. ఆ పేపర్ ఇచ్చినందుకు విద్యార్థుల నుంచి రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు పోలీసులు.

ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 33,960 జీతం, తెలంగాణ స్త్రీ నిధిలో ఉద్యోగాలు

పరీక్ష రద్దు వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలిగినా ఆ వ్యవస్థపై నమ్మకం కలిగించేందుకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఎన్టీఏ. పరీక్షకు సంబంధించి త్వరలో అధికారికంగా కొత్త తేదీలను ప్రకటించనుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం విద్యార్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని సూచన చేసింది.

మళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన పని లేదు. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణనలోకి తీసుకోనుంది. అంతేకాదు గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాలు చెల్లుబాటు కానున్నాయి. పరీక్ష తేదీకి ముందు అడ్మిట్ కార్డులను జారీ చేయనుంది ఎన్టీఏ.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×