E-Paper
Advertisement

I Bomma Ravi: కోర్టుకు రాను… ఐబొమ్మ రవి తండ్రి సంచలన నిర్ణయం

I Bomma Ravi: కోర్టుకు రాను… ఐబొమ్మ రవి తండ్రి సంచలన నిర్ణయం
Advertisement

IBomma Ravi: ఐబొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈయన పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేస్తూ భారీ స్థాయిలో డబ్బు సంపాదించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున నష్టాలను తీసుకురావడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.నాంపల్లి కోర్టు ఈయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. అయితే రవిని బయటకు తీసుకురావడం కోసం లాయర్ సలీం(Saleem) ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రవి తరపున వాదిస్తూ ఆయనని బెయిల్ మీద బయటకు తీసుకు వస్తానని సలీం ముందుకు రావడంతో సోషల్ మీడియా వేదికగా లాయర్ సలీంకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

ఐ బొమ్మ రవి కోసం లాయర్ సలీం..

ఎలాగైనా రవిని బయటకు తీసుకురండి సర్ మీకు ఎంత ఫీజు కావాలంటే అంత మేమే ఇస్తాము, రవి బయటకు వస్తే మీకు ఘనంగా సన్మానం చేస్తాము అంటూ లాయర్ సలీం పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్లు చేశారు. ఇలా ఈ కామెంట్లు బట్టి చూస్తేనే ఐ బొమ్మ రవి(Ibommae) బయటకు రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు స్పష్టమవుతుంది. ఇలా రవిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా లాయర్ సలీం రవి తండ్రి అప్పారావు(Apparao)ను కలిశారు. రవి తండ్రి ప్రస్తుతం విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో నివాసం ఉంటున్నారు. ఇలా తన స్వగ్రామానికి వెళ్లి లాయర్ సలీం రవి తండ్రి అప్పారావును కలిశారు.

రవికి తండ్రి నుంచి ఊహించని షాక్..

Advertisement

రవి తరపున తాను వాదించి తనని బయటకు తీసుకు వస్తానని అందుకు కావలసిన కొన్ని పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని సలీం తెలిపారు. అయితే రవి తండ్రి అప్పారావు మాత్రం అందుకు పూర్తిగా నిరాకరించారని తెలుస్తోంది. తన ఆరోగ్య పరిస్థితులు ప్రస్తుతం ఏమాత్రం బాలేవని ఆరోగ్యం సహకరించని నేపథ్యంలో తాను ఈ కేసు విషయంలో కోర్టుల చుట్టూ తిరగలేను అంటూ అప్పారావు చెప్పడంతో ఇది కాస్త సంచలనగా మారింది. తన కొడుకును బయటకు తీసుకురావడం కోసం స్వయంగా లాయర్లు ముందుకు వచ్చినప్పటికీ తన తండ్రి మాత్రం నిరాకరించడంతో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రవికి వ్యతిరేకంగా అప్పారావు..

Advertisement

మొదటినుంచి కూడా అప్పారావు తన కుమారుడు రవికి ఏ మాత్రం మద్దతుగా నిలబడలేదు. తన కొడుకు హైదరాబాదులో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారని మాత్రమే తెలుసు కానీ ఇలాంటి పాడిపని చేస్తున్నాడని తనకు తెలియదని, టీవీలలో వచ్చేవరకు కూడా నాకు ఈ విషయం తెలియదని తెలిపారు. అలాగే సినిమాల విషయంలో తన కొడుకు రవి చేస్తుంది పూర్తిగా తప్పని తన కొడుకు వ్యతిరేకంగా అప్పారావు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా తనకు బెయిల్ తెప్పించడం కోసం అవసరమైన పేపర్ల పై సంతకాలు చేయడానికి కూడా అప్పారావు నిరాకరించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×