E-Paper
Advertisement

Google TV Remote: గూగుల్ కొత్త టివి రిమోట్.. బ్యాటరీలు అవసరం లేదు, జీవితకాలం చార్జింగ్‌లోనే ఉంటుంది

Google TV Remote: గూగుల్ కొత్త టివి రిమోట్.. బ్యాటరీలు అవసరం లేదు, జీవితకాలం చార్జింగ్‌లోనే ఉంటుంది
Advertisement

Google TV Remote| ఇకపై టీవీ రిమోట్‌కి బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఉండదు. ఆ టెన్షన్ లేకుండానే గూగుల్ ఒక కొత్త సూపర్ రిమోట్ తీసుకురాబోతోంది. దీని పేరు G32. ఈ రిమోట్‌లో బ్యాటరీ పెట్టనక్కర్లేదు, ఛార్జర్‌తో ఛార్జ్ చేయనక్కర్లేదు. ఇంట్లో ఉండే సాధారణ లైట్ (ట్యూబ్ లైట్, బల్బు, ఎల్‌ఈడీ)తోనే ఇది ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయిపోతుంది. టీవీ చూస్తున్నప్పుడే రిమోట్ ఛార్జింగ్ జరుగుతుంది. ఎప్పటికీ బ్యాటరీ డెడ్ అని బాధపడాల్సిన పని లేదు!

ఈ సోలార్ రిమోట్ ఎలా పని చేస్తుంది?

ఈ రిమోట్‌ను గూగుల్ అధికారికంగా తయారు చేయిస్తోంది. కొరియా కంపెనీ ఓసంగ్ ఎలక్ట్రానిక్స్ దీని తయారుదారు . కానీ దీని మెయిన్ మ్యాజిక్ ..ఇండోర్ సోలార్ టెక్నాలజీ! ఈ టెక్నాలజీ ఇచ్చింది స్వీడన్ కంపెనీ ఎపిషైన్. ఇంటి లైట్‌తో ఛార్జ్ అయ్యేలా ప్రత్యేకమైన సోలార్ సెల్స్ తయారు చేశారు.

ఈ టెక్నాలజీ వెనక మ్యాజిక్ ఏంటి?

Advertisement

ఈ రిమోట్‌కు రెండు వైపులా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ముందు వైపు, వెనక వైపు రెండూ! అందుకే రిమోట్‌ను ఏ వైపు పెట్టినా ఛార్జ్ అవుతుంది. సోఫా మీద పడుక్కుని ఉన్నా, టేబుల్ మీద ఉన్నా, ఎక్కడ పెట్టినా పని చేస్తుంది. లైటింగ్ చాలా తక్కువగా ఉన్నా సరిపోతుంది. ఇందులో ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది. అది ఎప్పటికీ ఖాళీ కాదు. లైట్ నుంచి వచ్చే ఎనర్జీతో ఎప్పుడూ ఛార్జ్ అవుతూనే ఉంటుంది.
ఈ ప్రత్యేక సోలార్ సెల్స్‌ను ఎపిషైన్ కంపెనీ చాలా సన్నగా, ఫ్లెక్సిబుల్‌గా తయారు చేసింది. ఇవి రెండు వైపులా లైట్ పీల్చుకుంటాయి కాబట్టి రిమోట్‌ను సరిగ్గా పెట్టాల్సిన టెన్షన్ లేదు.

పర్యావరణానికి పెద్ద గిఫ్ట్

ఇది కేవలం మన సౌకర్యం కోసం మాత్రమే కాదు. పర్యావరణానికి కూడా చాలా మంచిది. ప్రపంచంలో ప్రతి సంవత్సరం బిలియన్ల కొద్దీ బ్యాటరీలు వ్యర్థమవుతున్నాయి. వాటి కారణంగా భూమి, నీరు కలుషితం అవుతోంది. ఈ సోలార్ రిమోట్ వల్ల ఆ వ్యర్థాలు తగ్గుతాయి. ఇకపై ఎలక్ట్రానిక్ వస్తువులు తేలికగా, మరింత అందంగా డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

ప్రస్తుతం ఈ G32 రిమోట్ మార్కెట్‌లో ఇంకా లాంచ్ కాలేదు. ఇప్పుడు ఇది కేవలం ఒక “రిఫరెన్స్ డిజైన్” మాత్రమే. అంటే ఇతర టీవీ కంపెనీలు (సోనీ, టీసీఎల్, హైసెన్స్ వంటివి) తమ కొత్త గూగుల్ టీవీల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించే అవకాశముంది. రాబోయే రోజుల్లో మన ఇంటి టీవీ రిమోట్ కూడా ఇలాంటిదే అయితే… బ్యాటరీ కొనడం, మార్చడం అనేవి అవసరమే ఉండదు.

Also Read: ముందు ఉపయోగించండి ఆ తరువాతే కొనండి.. ఇండియన్ స్మార్‌ఫోన్ కంపెనీ వింత ఆఫర్

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×