E-Paper
Advertisement

Hyderabad News: అన్నపూర్ణ-రామానాయుడు స్టూడియోలకు షాక్.. జీహెచ్‌ఎంసీ నోటీసులు

Hyderabad News: అన్నపూర్ణ-రామానాయుడు స్టూడియోలకు షాక్.. జీహెచ్‌ఎంసీ నోటీసులు
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లోని అన్నపూర్ణ-రామానాయుడు స్టూడియోలకు బల్దియా షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేతకు కారణంగా తెలుస్తోంది.

అన్నపూర్ణ-రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ  షాక్

Advertisement

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు ఫిల్మ్ స్టూడియోలకు నోటీసులు ఇచ్చారు జీహెచ్‌ఎంసీ అధికారులు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేత పాల్పడినట్టు తేలింది.

ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.49 వేలు మాత్రమే చెల్లిస్తోంది. ఇక రామానాయుడు స్డూడియో విషయానికి వద్దాం. దానికి ట్రేడ్ లైసెన్సు ఫీజు రూ. 1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు తేల్చారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని నోటీసులు ఇచ్చారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Advertisement

ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించడమే

జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా ట్యాక్సులు, ట్రేడ్ లైసెన్సుల ఫీజుల పాతవి పరిశీలన చేస్తోంది. గతేడాది రూ. 2000 కోట్ల పైగానే ట్యాక్సులు వసూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా ట్రేడ్ లైనెస్సుల ఫీజులపై దృష్టి పెట్టింది. దాదాపు 2 లక్షల మంది ఫీజులు చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించారట. వాటిలో అన్నపూర్ణ స్టూడియో ట్రేజ్ లైసెన్సుల ఫీజుల వ్యవహారం ప్రధానంగా హైలైట్ అయ్యింది.

ఇక అన్నపూర్ణ స్టూడియో విషయానికి వద్దాం..  8,172 చదరపు అడుగులకు గాను కేవలం రూ. 49 వేల 32 రూపాయలు చెల్లిస్తోంది. చెల్లించాల్సినది పెద్ద మొత్తంలో ఉంది. అంటే దాదాపు పదిన్నర లక్షల రూపాయలు ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించారు అధికారులు.

ALSO READ:  హీటెక్కిన ఓరుగల్లు రాజకీయం.. నాయిని సవాల్‌కి పత్తాలేని వినయ్ భాస్కర్

ఇక రామానాయుడు స్టూడియో విషయంలోనూ అదే జరిగింది.  1903 చదరపు అడుగులకు రూ. 7 వేల 614 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. మొత్తం స్టూడియో 68 వేల చదరపు అడుగుల్లో ఉంటే రెండు లక్షల 65 వేల పైచిలుకు చెల్లించాలి. కేవలం స్టూడియోలు మాత్రమేకాకుండా మిగతా పెద్ద పెద్ద సముదాయాలు ఆ తరహా జాబితాలో ఉన్నాయి. రేపోమాపో వాటికి కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

రోజుకి సినిమా బట్టి ఫ్లోర్ వైజ్‌గా అద్దె తీసుకుంటారు. అది రూ. 50 వేలు నుండి 80 వేలు వరకు ఉంటుంది. సెట్ వర్క్ జరిగితే ఒక రేటు, షూటింగ్ జరిగితే మరొక ధర ఉంటుంది. అయితే సందర్భం, టెక్నీషియన్‌ని బట్టి గంటకు 300 నుండి 600 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. డబ్బింగ్ స్టూడియో, సౌండ్ మిక్సింగ్ స్టూడియో ధరలు వేరేగా ఉంటాయి.

అందులో బిగ్‌బాస్ కూడా నిర్వహిస్తున్నారు. ఎండ‌మాల్ అనే కంపెనీ చేస్తోంది. ఏడాదికి లీజు సుమారు రూ. 1.60 నుండి 2 కోట్లు చెల్లిస్తోందట. మ్యూజిక్, మిక్సింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. వాటికి అధికంగా చార్జ్ చేస్తారు. అలాగే సినిమాని బట్టి ధర కూడా ఉంటుందని తెలుస్తోంది.

 

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×