E-Paper
Advertisement

బాక్సాఫీస్ దగ్గర ఏప్రిల్ ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తుందా? ఈ వారం సినిమాలపై పెరుగుతున్న అనుమానాలు!

బాక్సాఫీస్ దగ్గర ఏప్రిల్ ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తుందా? ఈ వారం సినిమాలపై పెరుగుతున్న అనుమానాలు!

Tollywood Boxoffice: సమ్మర్ అంటే ఎలా ఉండాలి. పెద్ద సినిమాలతో థియేటర్లు దద్దరిల్లిపోవాలి. టాప్ హీరోల ఎంట్రీలతో  స్క్రీన్లు షేక్ కావాలి. ఓవరాల్ గా బాక్సాఫీస్ కాసులతో గలగల లాడాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది.పోయిన వారం వచ్చిన బైకర్, రాకాస సినిమాలు టాక్ బాగుందన్న మాటే కానీ డబ్బులు రాల్చని పరిస్థితి. ఒకవైపు ఎండలని, మరో వైపు ఐపిఎల్ సీజన్ అని,ఇలా రీజన్స్ ఏవైనా బాక్సాఫీస్ బేల చూపులు చూస్తుందన్నది నిజం. పోనీ ఈ రెండో వారo వచ్చే సినిమాలైనా పరువు నిలబెడతాయనుకుంటే వాటి పరిస్థితి చూస్తుంటేనే ట్రేడ్ సర్కిల్స్ లో  గుబులు మొదలైపోతుంది.చూస్తుంటే  అడవి శేష్ ‘ప్రేమాయణం’ నుంచి డబ్బింగ్ సినిమాల ప్రయోగాల దాకా.. ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర గండం కాస్త గట్టిగానే  పొంచి ఉన్నట్టు  కనిపిస్తోంది.

థ్రిల్లర్ ఆశించి వచ్చే ఆడియన్స్‌కు లవ్ స్టోరీ ఎక్కుతుందా?

అడవి శేష్ విషయానికే వస్తే  ఇప్పటిదాకా మనకి గుర్తొచ్చేవి ‘గూఢచారి’,‘మేజర్’ లాంటి ఇంటెన్స్ థ్రిల్లర్స్.కానీ  ఈసారి రూటు  మార్చి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ‘డెకాయిట్’ అంటూ చేస్తున్న లవ్ స్టోరీ శేష్ కి ఎంత వరకు వర్కవుట్ అవుతుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.సినిమా ప్రేమకథే అయినా థ్రిల్స్ ఉంటాయని మేకర్స్ తెగ ఊరిస్తున్నారు కానీ శేష్ మార్కు థ్రిల్లర్ ఆశించి వచ్చే ఆడియన్స్‌కు ఈ లవ్ స్టోరీ ఎక్కుతుందా? అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇక ఇందులో అనురాగ్ కశ్యప్ పాత్ర స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు కానీ, ఆయన ఈ మధ్య చేసిన ప్రాజెక్టులు చూస్తుంటే అవి  సినిమాకు ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్. మరో వైపు సీతా రామం బ్యూటీ  మృణాల్ ఠాకూర్ లక్కీ హ్యాండ్ అని నమ్ముతున్నారు కానీ, కథలో దమ్ము లేకపోతే ఆ ‘లక్’ కూడా కాపాడలేదని ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయ్. ఇక ఏ మాత్రం బజ్ లేని ఈ సినిమాకి  థియేటర్లలో ఓపెనింగ్స్ రాకపోతే శేష్ హిట్ ట్రాక్‌కు బ్రేకులు పడటం మాత్రం ఖాయం.

సినిమాల్లో ‘అతి’ ఎక్కువైపోతోందనే టాక్

ఇక వరుస మూడు  100 కోట్ల సినిమాలాతో ఫుల్ జోరు మీదున్న కోలీవుడ్ కుర్ర హీరో కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్‌ తాజాగా LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)తో మరో సారి థియేటర్లపై ఎటాక్ చేసేందుకు రెడీ అయిపోయాడు.ఇక ట్రెండ్ చూస్తే యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది కూడా. కానీ ఆయన ఈ మధ్య ఆయన  తీసే సినిమాల్లో ‘అతి’ ఎక్కువైపోతోందనే టాక్ కూడా ఉంది.అయితే  ‘లవ్ టుడే’ సక్సెస్ తర్వాత వచ్చిన ‘డ్రాగన్’ తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయిందని వాస్తవం కూడా.ఇప్పుడు ‘LIK’ అంటూ 2040 బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్యూచరిస్టిక్ స్టోరీతో  వస్తున్నాడు.ఇక ట్రైలర్ చూస్తుంటే అంతా గ్రాఫిక్స్ హడావుడితో , సోషల్ మీడియా సెటైర్లతో నింపేసినట్టే ఉన్నాడు.ఇందులో ఫ్యూచర్ గురించి ప్రదీప్ చేసే అతి ప్రయోగాలు తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వకపోతే మాత్రం  బాక్సాఫీస్ దగ్గర ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ‘దివాళా’ తీయడం ఖాయం. అసలే డబ్బింగ్ సినిమా, అందులోనూ సింక్ లేని కాన్సెప్ట్ అయితే మాత్రం  ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే.మరో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ ఏ మాత్రం సక్సెస్ అవుతారో చూడాలి.

దానిని భరించడం ఈ కాలం యూత్‌కు సాధ్యమయ్యే పనేనా?

ఇక మలయాళ స్టార్ టొవినో థామస్ సినిమాలకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంటుందన్నది చెప్పక్కర్లేదు.కానీ ప్రస్తుతం థియేటర్లో డబ్బింగ్ బొమ్మలకి సీన్ వేరేలా ఉంటుంది. మరి ‘పళ్ళి చట్టంబి’ అనే వింత టైటిల్‌తో వస్తున్న1960ల నాటి పిరియాడిక్ డ్రామా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా చూడాలి.పీరియాడిక్ డ్రామా అంటేనే స్లో పేస్.దానిని భరించడం ఈ కాలం యూత్‌కు సాధ్యమయ్యే పనేనా? మలయాళ వాసన ఎక్కువగా ఉండే ఇలాంటి డల్ సబ్జెక్టులు తెలుగులో నిలబడటం కష్టమే.ఒకవేళ ఏ మాత్రం టాక్ తేడా కొట్టినా,మొదటి రోజే థియేటర్లకి తాళాలు వేయాల్సిందే.ఇక  ఇప్పటికే ‘అసలు ఈ టైటిల్ ఏంట్రా బాబు, తెలుగులో పెట్టొచ్చుగా.. మా ప్రాణాలు తీయకపోతే’ అన్న కామెంట్స్ గట్టిగానే వేస్తున్నారు మన సోషల్ మీడియా వారియర్స్.మొత్తానికి ఈ వారం వస్తున్న మూడు సినిమాల్లోనూ రిస్క్ ఫ్యాక్టర్ గట్టిగానే ఉంది. మరి అడవి శేష్ డెకాయిట్ కాసులు కొల్లగొడతాడా ..  ప్రదీప్ చేస్తున్న లిక్ క్లిక్ అవుతుందా? లేక టొవినో పాత కాలపు డ్రామా పళ్ళి చట్టంబి’  పల్టీ కొడుతుందా? అనేది కాలమే డిసైడ్ చేయాలి.

also read:పెద్ది ‘పహిల్వాన్’ దెబ్బకు రికార్డులు గల్లంతు.. రిలీజ్‌కు ముందే అన్ని కోట్ల ఓటీటీ డీలా ? చరణ్ రేంజ్ వేరబ్బా!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×