E-Paper
Advertisement

ఫస్ట్ నైట్ రోజు.. నవ వధువుపై సామూహికంగా.. వరుడే ఫ్రెండ్స్‌తో కలిసి..!

ఫస్ట్ నైట్ రోజు.. నవ వధువుపై సామూహికంగా.. వరుడే ఫ్రెండ్స్‌తో కలిసి..!
Advertisement

Hyderabad Shocker: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన 22 ఏళ్ల యువతి.. తన భర్త అతని స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫస్ట్ నైట్ రోజు తనపై భర్త, అతడి స్నేహితులు సామూహిక  అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ఎదుట వాపోయింది. గతేడాది బేగంపేట్ లో నివసిస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుందని బాధితురాలు కంప్లైంట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ.. వితంతు తల్లి, సోదరితో కలిసి కూకట్ పల్లిలో జీవిస్తోంది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు.. వారి ఇంట్లోని కొంత భాగాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలితో అతడికి బంధం ఏర్పడింది. ఈ క్రమంలో గతేడాది జులై 28న కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారికి వివాహం కూడా జరిగింది.

ఆమెతో మద్యం తాగించి.. ఆపై!

Advertisement

పెళ్లైన మరుసటి రోజు దంపతులు ఇద్దరు.. బేగంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో దిగారు. ఆ రాత్రి సెలబ్రేషన్స్ పేరిట ఐదుగురు స్నేహితులను భర్త ఇంటికి ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన స్నేహితులు.. తన భర్తతో కలిసి మద్యం సేవించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనను తాగమంటూ బలవంతం చేశారని ఆమె ఆరోపించారు. తాను స్పృహ కోల్పోయిన తర్వాత.. భర్త, అతడి స్నేహితులు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.

Also Read: ఎయిర్‌టెల్ అపరిమిత ప్లాన్స్.. నెల రోజులు మీ ఇష్టం.. డేటా, ఓటీటీలు ఎంతైనా వాడొచ్చు!

ఇన్నాళ్లు మౌనం ఎందుకంటే?

Advertisement

తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించగా.. నిందితులు బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిని, సోదరిని చంపేస్తామని హెచ్చరించడంతో ఇన్నాళ్లు మౌనంగా ఉండిపోయాయని ఆమె చెప్పుకొచ్చారు. చివరకు ధైర్యం కూడగట్టుకొని వారిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పోలీసులతో బాధితురాలు అన్నట్లు సమాచారం. అయితే బేగంపేటలో తనపై లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు ఆరోపిస్తుండటంతో కూకట్ పల్లి పోలీసులు.. అక్కడి స్టేషన్ కు కేసును బదిలి చేశారు. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: జియోను నిలదీసిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకూ డెడ్ లైన్.. యూజర్లకు మాత్రం పండుగే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×