E-Paper
Advertisement

ఎండల నుంచి రక్షణ.. ఈ సమ్మర్ హ్యాక్స్ పాటిస్తే.. వడదెబ్బ మీ దరి చేరదు!

ఎండల నుంచి రక్షణ.. ఈ సమ్మర్ హ్యాక్స్ పాటిస్తే.. వడదెబ్బ మీ దరి చేరదు!
Advertisement

Summer Safety Tips: కాలం రానే వచ్చింది. పెరిగే ఉష్ణోగ్రతలు, మిరిమిట్లు గొలిపే ఎండలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం ఏసీలు, కూలర్ల మీద ఆధారపడటమే కాకుండా.. మన లైఫ్ స్టైల్లో చిన్న పాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ కాలాన్ని హాయిగా గడపొచ్చు. మీ శరీరాన్ని అంతర్గతంగా చల్లబరచడం, స్కిన్ కేర్, సహజ పద్ధతుల్లో ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి అవసరమైన, అత్యంత ప్రభావవంతమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఆహారం, డ్రింక్స్ :
ఎండాకాలంలో మన జీర్ణశక్తి కొంచెం మందగిస్తుంది. అందుకే తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి.

Advertisement

నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు: పుచ్చకాయ, సపోటా, కర్బూజ, తాటి ముంజలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి శరీరానికి కావలసిన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.

దేశీ డ్రింక్స్:ఫ్రిజ్ వాటర్ కంటే మట్టి కుండ నీరు శ్రేష్ఠం. రోజుకు కనీసం రెండు గ్లాసుల పల్చటి మజ్జిగ, రాగి అంబలి లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.

Advertisement

సబ్జా గింజలు: వీటిని నీటిలో నానబెట్టి తాగడం వల్ల తక్షణమే శరీరం చల్లబడుతుంది.

2. ఇంటిని చల్లబరిచే సహజ మార్గాలు:
ఏసీ బిల్లులు భారంగా అనిపిస్తున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

క్రాస్ వెంటిలేషన్: సాయంత్రం వేళ గాలి వీచే దిశలో కిటికీలు తెరిచి ఉంచండి. గదుల్లో వేడి గాలి బయటకు వెళ్లేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను వాడండి.

ఇండోర్ ప్లాంట్స్: స్నేక్ ప్లాంట్, అలోవెరా, మనీ ప్లాంట్ వంటివి గదిలోని వేడిని పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.

తడి తెరలు: కిటికీలకు ఉన్న కర్టెన్లపై కొంచెం నీళ్లు చిలకరించడం వల్ల లోపలికి వచ్చే గాలి చల్లగా మారుతుంది.

3.చర్మం,హెయిర్ కేర్:
సూర్యరశ్మిలోని UV కిరణాల నుంచి రక్షణ పొందడం చాలా ముఖ్యం.

సన్‌స్క్రీన్ వాడకం: బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవాలి.

బట్టల ఎంపిక: సింథటిక్ బట్టలకు దూరంగా ఉండండి. లేత రంగులో ఉండే కాటన్ (నూలు)బట్టలు చెమటను పీల్చుకుని చర్మానికి గాలి తగిలేలా చేస్తాయి.

రాత్రి పూట కేర్: పడుకునే ముందు పాదాలకు ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే కళ్లు, శరీరం చల్లబడతాయి.

4.వడదెబ్బ నుంచి రక్షణ:
మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ లేదా కళ్లద్దాలు తప్పనిసరి. బయట దొరికే రంగు రంగుల కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం మేలు.

Also Read: షుగర్ పేషెంట్స్ జాగ్రత్త! వేసవిలో ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ముప్పు

5. పక్షులు, జంతువుల పట్ల కనికరం:
మనలాగే మూగజీవాలు కూడా ఎండకు అలమటిస్తాయి. మీ ఇంటి బాల్కనీలో లేదా కాంపౌండ్ లో చిన్న గిన్నెలో నీళ్లు, కొన్ని గింజలు ఉంచండి. ఇది పర్యావరణానికి మనం చేసే చిన్న మేలు.

వేసవి అంటే.. కేవలం ఎండలు మాత్రమే కాదు.. జాగ్రత్తలు పాటిస్తే ఇది సెలవుల ఆనందాన్ని ఇచ్చే కాలం కూడా.. పైన పేర్కొన్న సహజమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు ఈ వేసవిని ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడపవచ్చు.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×