E-Paper
Advertisement

AR Rahman: కొత్త ప్రయాణం మొదలెట్టిన రెహమాన్ కూతురు.. తొలి ప్రదర్శన ఎక్కడంటే?

AR Rahman: కొత్త ప్రయాణం మొదలెట్టిన రెహమాన్ కూతురు.. తొలి ప్రదర్శన ఎక్కడంటే?
Advertisement

AR Rahman:ఆస్కార్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ (AR Rahman) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో.. ఊహించని బీజీఎంతో సినిమాలకే కాదు పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన పెద్ది సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. చికిరి చికిరి అంటూ రిలీజ్ చేసిన పాట మ్యూజిక్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అంతలా ఎప్పటికప్పుడు తన పర్ఫామెన్స్ తో అదరగొడుతూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు.

ఏ ఆర్ రెహమాన్ బాటలోనే కూతురు..

ఇదిలా ఉండగా తాజాగా ఈయన కూతురు కూడా ఈయన దారిలోనే నడవబోతోంది. అందులో భాగంగానే ఆమె ఒక కొత్త బ్యాండ్ ను ఏర్పాటు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ పూర్తిగా మహిళలతో కూడిన Rooh – e – Noor అనే మ్యూజిక్ బ్యాండ్ ను ప్రారంభించారు. దీనికి రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బ్యాండ్ లో మొత్తం ఆరుగురు మహిళలు ఉన్నారు.

మొదటి ప్రదర్శన ఎక్కడంటే?

Advertisement

ఈ బృందం నవంబర్ 21న దుబాయ్ లో జరిగే తన్వీర్ ఫెస్టివల్ లో తొలి ప్రదర్శన ఇవ్వనుంది. ఈ బ్యాండ్ ముఖ్యంగా సినిమా, ఆధ్యాత్మిక పాటలతో పాటు మధుర గీతాలను కూడా సరికొత్తగా అందిస్తుందని రెహమాన్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి శుక్రవారం జరగబోయే ఈవెంట్లో రెహమాన్ కూతురు ఖతీజా తన టీం తో కలిసి ఆలపించే గానం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ:Actress Death: 7దశాబ్దాల అనుభవం.. ప్రముఖ నటి కన్నుమూత!

ఏఆర్ రెహమాన్ కెరియర్..

Advertisement

సంగీత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న ఏ ఆర్ రెహమాన్ స్వరకర్త, గాయకుడు, గీతా రచయిత, నిర్మాత, దాతగా కూడా తనకంటూ ఒక పేరు దక్కించుకున్నారు. ఈయన జన్మనామం ఏఎస్ దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న ఈయన.. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనలకు సంగీతం అందించిన ఈయన.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి తొలిసారి సంగీతాన్ని అందించి మంచి పేరు దక్కించుకున్నారు.

మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డు కూడా లభించింది. అంతేకాకుండా రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలతో పాటు ఒక బిఏఎఫ్టిఏ పురస్కారంతోపాటు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిలింఫేర్ పురస్కారాలు, 3 ఫిలింఫేర్ సౌత్ పురస్కారాలను దక్కించుకున్నారు ఏ ఆర్ రెహమాన్.

Related News

చిరు ‘కాక’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×