E-Paper
Advertisement

Chirag Paswan: లోక్ సభలో 100%, బీహార్ లో 75% స్ట్రైక్ రేట్.. చిరాగ్ పాశ్వాన్ ది రాక్ స్టార్

Chirag Paswan: లోక్ సభలో 100%, బీహార్ లో 75% స్ట్రైక్ రేట్.. చిరాగ్ పాశ్వాన్ ది రాక్ స్టార్
Advertisement

Chirag Paswan: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం వైపు దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆధిక్యం కొనసాగిస్తోంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ(రాం విలాస్ పాశ్వాన్) పార్టీ పోటీ చేసిన 25 స్థానాల్లో 22 చోట్ల ముందంజలో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో 100 శాతం సీట్లలో విజయం సాధించిన ఎల్జేపీ, ఇప్పుడు 75 శాతం స్ట్రైక్ రేట్ తో విజయానికి దగ్గరైంది.

22 స్థానాల్లో ఆధిక్యం

2020 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన చిరాగ్ పార్టీ ఈసారి 22 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తన తండ్రి దివంగత నేత రాం విలాస్ పాశ్వాన్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన చిరాగ్ పాశ్వాన్ అనేక ఎదురుదెబ్బలు తిన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను ‘హనుమాన్’గా ప్రకటించుకున్న చిరాగ్.. బీజేపీతో కలిపి పనిచేస్తున్నారు. తాజాగా బీహార్ రాజకీయాల్లో కొత్త స్టార్ గా ఆవిర్భవించారు. 43 ఏళ్ల చిరాగ్ నాయకత్వం వైపు యువత ఆకర్షితులవుతున్నారు.

Advertisement

దళిత నేత రాం విలాస్ పాశ్వాన్ మరణించిన తర్వాత లోక్ జనశక్తి పార్టీ (LJP)లో చీలిక వచ్చింది. 2015 ఎన్నికల తర్వాత తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ తో చిరాగ్ కు విభేదాలు రావడంతో 2021లో ఎల్జేపీ (రాం విలాస్) పేరుతో కొత్త పార్టీని పెట్టారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు.

రాం విలాస్ ఉన్నప్పుడే చిరాగ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ఆయన నాయకత్వ లక్షణాలు అందుకునేందుకు కొంత సమయం పట్టింది. తండ్రి మరణం తర్వాత చోటుచేసుకున్న పరిస్థితులతో రాజకీయాల్లో రాటుదేలారు. రాం విలాస్ మరణించిన తర్వాత చిరాగ్ మామ పశుపతి కుమార్ పరాస్‌ను బీజేపీ కేంద్ర మంత్రిగా చేసింది. అలాగే 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కూటమిలోని జేడీయూ పట్టుబట్టడంతో చిరాగ్ ను కూటమికి దూరంగా ఉంచారు.

రాం విలాస్ పాశ్వాన్ రాజకీయ వారసుడిగా

Advertisement

ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిస్థితులలో ఎల్జేపీ చిహ్నాన్ని భారత ఎన్నికల కమిషన్ స్తంభింపజేసింది. దీంతో చిరాగ్ తన వర్గానికి LJP (రామ్ విలాస్) అనే పేరును పెట్టుకున్నారు. పరాస్ తన వర్గానికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అనే పేరు పెట్టుకున్నారు. అభివృద్ధి కోసం స్పష్టమైన ఆలోచనలు కలిగిన నాయకుడిగా చిరాగ్ కు యువతలో మంచి పేరుంది. గత సంవత్సరం బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చిరాగ్ పాశ్వాన్ ను కేంద్రమంత్రిగా చేసి తన తండ్రి వారసత్వానికి చిరాగ్ ను వారసుడిగా గుర్తించింది.

సీఎం పదవికి సిద్ధమని ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిరాగ్ తాను బీహార్ రాజకీయాలకు తిరిగి రావాలనుకుంటున్నానని, సీఎం పదవికి తాను సిద్ధంగా ఉన్నానని ఒకటి రెండుసార్లు ప్రస్తావించారు. తాను బీహారీల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించుకున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఏకైక కారణం.. దేశంలోని ఇతర ప్రాంతాలలో బీహారీలను ఎలా చూస్తారో, అవమానిస్తారో చూశాకా, అది మార్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మూడుసార్లు ఎంపీగా ఉండటం వల్ల తాను బీహారీల కోసం పెద్దగా ఏం చేయలేనని, తాను రాష్ట్రానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఎన్నికల ప్రచారంలో చిరాగ్ తెలిపారు.

Also Read: Prashant Kishore: వ్యూహకర్తకు ఊహించని షాక్.. పీకేను లెక్కచేయని బీహార్ ఓటర్లు

జనసేనతో పోలుస్తూ

ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చిరాగ్.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 29 స్థానాలు దక్కాయి. అయితే పరిణితి ప్రదర్శంచిన చిరాగ్ ప్రచారంలో దూసుకుపోయారు. రాష్ట్రంలో అన్ని ప్రచారాల్లో, ర్యాలీలను యాక్టివ్ గా పాల్గొన్నారు. యువ బీహారీ అంటూ ప్రజలకు చేరువయ్యారు. ప్రస్తుతం 22 స్థానాల్లో ఎల్జేపీ(ఆర్వీ) విజయం దిశగా సాగుతోంది. సోషల్ మీడియాలో ఎల్జేపీ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని జనసేనతో పోలుస్తున్నారు.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×