Arya Comments : రాజారాణి, సైజ్ జీరో వంటి సినిమాలతో తెలుగు వారందరికీ దగ్గరైన తమిళ నటుడు ఆర్య చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయ్. అవును… కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో సాధువుల ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు తలదాచుకుంటున్నారంటూ బాంబు పేల్చాడు. తాజాగా మిస్టర్ ఎక్స్’ (Mr. X) ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్య నేనే దేవుణ్ణి (Naan Kadavul) షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలని ఇలా పంచుకున్నాడు.
ముఖ్యంగా మహా కుంబమేళా వంటి జాతరలు జరిగినపుడు
దాదాపు 17 ఏళ్ల క్రితం 2009లో దర్శకుడు బాలా దర్శకత్వంలో ఆర్య నేనేదేవున్ని అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా సినిమా కోసం వారణాసిలో ఎక్కువ రోజులు గడపాల్సివచ్చింది. సినిమాలో తాను పోషించే పాత్ర కోసం అక్కడ ఉండే అఘోరాలని,సాధువుల జీవన శైలిని దగ్గరుండి పరిశీలించిన తనకి అక్కడి పోలీసులు ఈ షాకింగ్ న్యూస్ చెప్పారని తెలిపాడు. అన్నింటి కన్నా ముఖ్యంగా మహా కుంబమేళా వంటి జాతరలు జరిగినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారన్నాడు.
also read:సింగర్ వర్సెస్ లాయర్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మంగ్లీ.. అసలు ఏం జరుగుతోంది?
సాధువుల వేషంలో ఉంటూనే సీక్రెట్ గా వెపన్స్ కూడా
దేశంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలు వంటి ఘోరమైన నేరాలు చేసి తప్పించుకున్న వారు తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు కాశీకి చేరుకుంటారని, అక్కడ కాషాయ వస్త్రాలు ధరించి గడ్డాలు పెంచి సాధువుల అవతారం ఎత్తుతారని చెప్పుకొచ్చాడు. వీరికి ఎలాంటి గుర్తింపు పత్రాలు (ID Cards) ఉండవని సదా కాలం ‘స్వామి’ అనే పేరుతోనే అక్కడ తిరుగుతూ ఉండారని. ఇక మరికొందరు సాధువుల వేషంలో ఉంటూనే సీక్రెట్ గా వెపన్స్ కూడా దుస్తుల లోపల్లో దాచుకుంటారన్న విషయాన్ని పోలీసులు చెప్పినపుడు చాలా భయమేసిందని ఆనాటి సంగతుల్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.
తనతో కలిసి నటించిన సాయేషా సైగల్ తో 2019లో వివాహం
ఇక ఆర్య నటిస్తున్న ‘మిస్టర్ ఎక్స్’ (Mr. X) విషయానికే వస్తే ప్రిన్స్ పిక్చర్స్ పై లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆర్యతో పాటు గౌతమ్ కార్తీక్, మంజు వారియర్, శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. ఇక ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయకి ‘గుణ 369’లో జోడీగా నటించిన అనఘా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా ఎఫ్.ఐ.ఆర్ (FIR) ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇక ఆర్య వ్యక్తిగత జీవితానికి వస్తే ‘గజినీకాంత్’ మరియు ‘టెడ్డీ’ సినిమాలతో తనతో కలిసి నటించిన సాయేషా సైగల్ ని 2019లో వివాహం చేసుకోగా వీరికి ఆర్యానా అనే కుమార్తె కూడా ఉంది.
ఏది ఏమైనా రాజా రాణి, వారసుడు, సార్పట్ట పరంపర వంటి డిఫరెంట్ సినిమాలతో తనదైన ముద్ర వేసిన ఆర్య చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయ్. కొందరు ఆర్యకి సపోర్ట్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది కాశీ లాంటి పుణ్యక్షేత్రం పై ఇలా మాట్లాడ్డం సరికాదంటూ కౌంటర్ ఇస్తున్నారు. చూడాలి ముందు ముందు ఆర్య రాజేసిన మంటలు ఎంతలా చెలరేగుతాయో!
also read:టాలీవుడ్ షాకింగ్ రియాలిటీ ..డైరెక్టర్లు ‘ఫుల్’.. హీరోలు ‘నిల్’!