E-Paper
Advertisement

టాలీవుడ్ షాకింగ్ రియాలిటీ ..డైరెక్టర్లు ‘ఫుల్’.. హీరోలు ‘నిల్’!

టాలీవుడ్ షాకింగ్ రియాలిటీ ..డైరెక్టర్లు ‘ఫుల్’.. హీరోలు ‘నిల్’!
Advertisement

Tollywood Directors: సినీ ఇండస్ట్రీలో హిట్టే మాట్లాడుతుంది,ఎవరెన్ని చెప్పినా ఎంతలా ఊదరగొట్టినా ఫైనల్ గా చేతిలో హిట్టు లేకపోతె ఎంత పెద్ద డైరెక్టర్ అయినా వెయిటింగ్ లిస్టులో ఉండాల్సిందే.ఇదిగో ఇపుడు అదే వెయిటింగ్ లిస్ట్ లోకి పడిపోయారు ఈ స్టార్ డైరెక్టర్స్.బాబ్బాబు మా దగ్గరో కథుంది కాస్త విని పెట్టరూ అంటూ తెగ చక్కర్లు కొడుతున్నారట.ఈరోజులో టైర్1హీరోలే కాదు టైర్2హీరోలు కూడా ఒకే సారి రెండు మూడి సినిమాలకి సైన్ చేసేస్తున్నారు.అంతా డిజిటల్ మహిమ మరి.మరింతకీ ఏ హీరో దొరుకుతాడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆ డైరెక్టర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.

ఎవరితో కొరటాల 

Advertisement

కొరటాల శివ విషయానికే వస్తే తీసిన చివరి సినిమా దేవర.ఇదికూడా అలాంటి ఇలాంటి హిట్టు కాదండోయ్..ఏకంగా ఐదొందల క్లబ్ లో కూర్చున్న సినిమా.RRRతర్వాత తారక్ చేసిన సినిమా అవడంతో అంచనాలు ఆకాశానికి తాకడంతో కాసుల వర్షం కురిపించారు ఆడియన్స్.ఇంకేం ఈ సినిమా తర్వాత దీనికి సీక్వెల్ ఉంటుందన్న వార్తలు వచ్చాయ్.తారక్ దీన్ని స్వయంగా కన్ఫాం చేశాడు కూడా.అయితే ఏమైందో ఏమో కాని ఉన్నపళంగా ఈ సినిమా పక్కకెళ్ళి పోయింది.మరో వైపు కొరటాల అటు బాలయ్య అని,ఇటు నాగ చైతన్య అని కాదు కూడదంటే కిరణ్ అబ్బవరం అని ఇలా ఏ హీరో చేద్దామనుకున్న ప్రాజెక్ట్ సెట్టవ్వని పరిస్థితి.

హీరో దొరికేనా పరశురామ్ 

Advertisement

ఇక ఫ్యామిలీ స్టార్ తో  ఫ్యామిలీలు సినిమాలు చూడాలంటేనే భయపెట్టిన డైరెక్టర్ పరశురాం.గీతా గోవిందం క్రెడిబిలిటీతోనే ఇంకా నెట్టుకొస్తున్న ఈ డైరెక్టర్ ఆ మధ్య కోలీవుడ్ హీరోలు సూర్య,కార్తీ లకి కథ చెప్పాడని,దిల్ రాజు నిర్మాతగా సినిమా పక్కాగా ఉండొచ్చు అన్న టాక్ వినబడింది.కాని గాసిప్స్ వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ డైరెక్టర్ గారికి హీరో దొరకట్లేదంటే హీరోలు బయపడిపోతున్నారొ,లేక తన రేంజ్ కి తగ్గ హీరో దొరకట్లేదని ఆగుతున్నాడో ఈయనగారికే తెలియాలి.

also read:DDLJ అరుదైన రికార్డ్.. నెట్టింట షారుఖ్ ఫ్యాన్స్ రచ్చ!

జాట్ సీక్వెల్ బోయపాటి చేతిలో పెడితే

ఇక అఖండ2తో పర్లేదనిపించిన బోయపాటి కూడా హీరోల అడ్రస్ దొరక్క చక్కర్లు కొడుతున్నవాడే.నిజానికి సరైనోడు కి సీక్వెల్ గీతా ఆర్ట్స్ లో ఉండాల్సింది.కాని పుష్ప తర్వాత బన్నీ రేంజ్ పెరిగిపోవడం తో ఈ కథని పక్కన పెట్టేశారన్న టాక్ ఉంది.మరో వైపు రానా,లేదా బాలీవుడ్ స్టార్ రణబీర్ సింగ్ లతో ప్రాజెక్ట్ ఉండొచ్చు అన్న న్యూస్ వినిపిస్తున్నా క్లారిటీ లేని పరిస్థితి.ఇంకో వైపు జాట్ సీక్వెల్ ని బోయపాటి చేతిలో పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుందట మైత్రి మేకర్స్.ఏదైనా అఫీషియల్ అనౌన్స్ వచ్చేవరకు ఏదీ పక్కా అని చెప్పలేం.

హరీష్ ని చూస్తేనే పారిపోతున్న హీరోలు

ఇక లేటెస్ట్ గా ఉస్తాద్ తో బొక్కబోర్లా పడ్డ హరీష్ ని చూస్తేనే పారిపోతున్నారట హీరోలు,మిస్టర్ బచ్చన్ ప్లాప్ అయినా పవన్ ఉస్తాద్ తో అయినా సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడనుకుంటే అదీ అడ్డంగా పోవడంతో హరీష్ నెక్స్ట్ ఎవరితో జోడీ కడతాడా అన్న క్యూరియాసిటీ కనిపిస్తుంది.బాలయ్యపై మనసు పారేసుకున్నాడని వినిపిస్తుంది.చూడాలి మరి ఈయనగారిని నమ్మి డేట్స్ ఇచ్చే ఆ హీరో ఎవరో.

వరుణ్ తేజ్ కి సూటి పెట్టిన మారుతి 

ఇక రాజాసాబ్ తో రెబల్ ఫ్యాన్స్ కి నైట్ మేర్ లా అయిపోయాడు మారుతి.తేడా వస్తే నా ఇంటికి వచ్చేయండి అంటూ ఓవర్ బిల్డప్ ఇచ్చిన ఈయనగారికి రెబల్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో టార్చర్ పెట్టారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.చిన్న సినిమాలని బాగానే హ్యాండిల్ చేసే మారుతి పెద్ద సినిమాల దగ్గరికి రాగానే హ్యండ్సప్ చేస్తాడన్న టాక్ ఉంది.ఇక ఈయన గారు వరుణ్ తేజ్ కి సూటి పెట్టారన్న టాక్ వినిపిస్తుంది,చూడాలి మెగా ప్రిన్స్ కెరీర్ లో మరో రిస్క్ తీసుకుంటాడో లేదో.

చూడాలి మరి…ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆశగా ఎదురు చూస్తున్న ఈ డైరెక్టర్స్ లో ఎవరు త్వరగా కొబ్బరికాయ కొట్టేస్తారో!..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×