E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి దర్శకుడు హరీష్ శంకర్ పోస్ట్ వైరల్.. మ్యాటర్ ఏంటంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి దర్శకుడు హరీష్ శంకర్ పోస్ట్ వైరల్.. మ్యాటర్ ఏంటంటే?
Advertisement

Ustaad Bhagat Singh: టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ ప్రత్యేకం. దశాబ్దం క్రితం ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ – దేవీశ్రీ ప్రసాద్ త్రయం మళ్లీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చేతులు కలిపారు. ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన దర్శకుడు హరీష్ శంకర్ పెట్టిన పోస్టర్ చూస్తుంటే సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో వచ్చాయని తెలుస్తోంది. హరీష్ శంకర్ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ (Aura of Ustaad) కేప్షన్ తో ఓ ఫోటోను విడుదల చేశారు. అందులో హరీష్, చంద్రబోస్ కలిసి దేవీశ్రీ ప్రసాద్ ను ఎత్తుకున్నట్లు ఉంది. అంటే ఆరా ఆఫ్ ఉస్తాద్ ఏం రేంజ్ లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఒక అద్భుతమైన ట్యూన్ మరియు పవర్ ఫుల్ సాహిత్యం కుదిరినప్పుడు కలిగే తృప్తి ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది.

Read also-Anchor Sravanthi: అల్లు అర్జున్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన యాంకర్.. ఏం జరిగిందంటే?

ఆనందానికి కారణం అదే..

Advertisement

సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ (DSP) పవన్ కళ్యాణ్ ఎనర్జీకి తగ్గట్టుగా అద్భుతమైన బీట్‌ను అందించారు. ఈ పాట రికార్డింగ్ పూర్తయిన తర్వాత, ఆ ట్యూన్ విన్న హరీష్ శంకర్, చంద్రబోస్ తమ సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. “దేవీ తన మ్యూజిక్‌తో ఒక అగ్నిపర్వతాన్ని సృష్టించాడు. చంద్రబోస్ పదాలు దానికి పవర్ ఇచ్చాయి” అని హరీష్ శంకర్ ఈ సందర్భాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రికార్డులు క్రియేట్ చేసింది. మరోసారి ఈ కాంబో రిపీట్ కావడంతో ఆ సినిమాకు మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని అభిమానులు ఆసిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజమ్స్‌ను హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసే విధానం ప్రేక్షకులకు ఒక ఐ-ఫీస్ట్ కానుంది. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాట కోసం పవర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ‘ఆరా’ను వర్ణిస్తూ పదునైన పదాలు వాడినట్లు సమాచారం.

Read also-Brahmamudi Serial Today February 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ట్రస్ట్ పెట్టాలని ఆలోచిస్తున్న రాజ్, కావ్య  

ఫ్యాన్స్ హంగామా

Advertisement

ఈ వైరల్ ఫోటో చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. “ముగ్గురు ఉస్తాద్‌లు కలిశారు.. ఇక బాక్సాఫీస్ దగ్గర వేట మొదలే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఒక ప్రోమో సాంగ్‌కే చిత్ర బృందం ఇంతలా ఎగ్జైట్ అయిందంటే, పూర్తి సినిమా థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సినిమాపై ఉన్న హైప్‌ను రెట్టింపు చేసింది. దేవీశ్రీ ప్రసాద్ తన మార్కు ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడని ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతోంది. ఈ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×