E-Paper
Advertisement

Anchor Sravanthi: అల్లు అర్జున్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన యాంకర్.. ఏం జరిగిందంటే?

Anchor Sravanthi: అల్లు అర్జున్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన యాంకర్.. ఏం జరిగిందంటే?
Advertisement

Anchor Sravanthi: ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్, నటి శ్రవంతి తన సినీ ప్రయాణం గురించి సంచలన, భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె ప్రస్తుత స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న కష్టాలను వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. శ్రవంతి తన సినీ ప్రయాణాన్ని 2009లో ప్రారంభించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఆమెకు అమితమైన గౌరవం. అల్లు అర్జున్ కూడా కెరీర్ తొలినాళ్లలో ఎంతో కష్టపడి, తన డ్యాన్స్, నటనతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న వైనం తనకెంతో స్ఫూర్తినిస్తుందని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన సొంత ఎదుగుదలను వివరిస్తూ, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఎవరి అండ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్య్వూ తన జీవితాన్ని మార్చేసిందని.. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదన్నారు.

Read also-Podarillu Today Episode : ప్రతాప్ కు నిజం చెప్పిన హారిక.. చక్రికీ మాటిచ్చిన మహా.. నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఆ రోజులు..

Advertisement

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం నుంచి వచ్చిన శ్రవంతి, తన తండ్రి తనను హైదరాబాద్‌లోని దిల్షుక్‌నగర్ హాస్టల్‌లో వదిలి వెళ్ళిన రోజును గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి తన కాళ్ళ మీద తాను నిలబడుతూ, పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. తనలో ఉన్న పట్టుదల రాయలసీమ రక్తం వల్ల వచ్చిందని, ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడానని ఆమె తెలిపారు. తన తల్లి ఇచ్చిన ధైర్యమే తనను ఇన్ని ఏళ్లు ఇండస్ట్రీలో నిలబెట్టిందని ఎమోషనల్ అయ్యారు. దాదాపు 17 ఏళ్ల పాటు యాంకర్‌గా వేలాది షోలు చేసిన శ్రవంతి, ఇప్పుడు ‘హే భగవాన్’ వంటి సినిమాలతో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇంటర్వ్యూ చేసే స్థాయి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదగడం తన లైఫ్ అచీవ్‌మెంట్ అని ఆమె పేర్కొన్నారు.

Read also-Intinti Ramayanam Today Episode: రాజేంద్రను చూసి కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవి కన్నింగ్ ప్లాన్.. గ్రాండ్ గా శ్రీయ సీమంతం..

కష్టమే పెట్టుబడి

Advertisement

గంటల తరబడి నిలబడి షూటింగ్స్ చేయడం, సరైన గుర్తింపు కోసం ఎదురుచూడటం వంటి విషయాలను తలుచుకుంటూ ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అల్లు అర్జున్ వంటి స్టార్లు కూడా ఇంతే కష్టపడి పైకి వచ్చారని, వారిని చూస్తుంటే తనకు మరింత ఉత్సాహం వస్తుందని ఆమె వివరించారు. చివరగా, ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, కేవలం కష్టాన్ని నమ్ముకుని 16 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలబడటం సామాన్యమైన విషయం కాదు. శ్రవంతి పంచుకున్న ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×