E-Paper
Advertisement

మెగా హీరోలపై మాటల దాడి.. స్టాండప్ కమెడియన్ కి కోర్టులో ఊరట..కానీ?

మెగా హీరోలపై మాటల దాడి.. స్టాండప్ కమెడియన్ కి కోర్టులో ఊరట..కానీ?
Advertisement

Anudeep Katikala:హైదరాబాద్ కి చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల ఇటీవల ఒక షో నిర్వహించారు. అందులో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, 3 వివాహాలపై అనుదీప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు . పైగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అయిన రామ్ చరణ్ , నిహారిక కొణిదెలపై కూడా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లు.. అలాగే నిహారిక విడాకుల విషయంలో పవన్ కళ్యాణ్ సలహా తీసుకోవచ్చని వేసిన జోకులు మెగా అభిమానులను.. ఇటు జనసేన కార్యకర్తలను పూర్తి ఆగ్రహానికి గురిచేసాయి.

మెగా సెలబ్రిటీలపై అనుదీప్ అనుచిత వ్యాఖ్యలు..

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో అనుదీప్ పై జనసేన పార్టీ నేత బడే వెంకటకృష్ణ కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుదీప్ కావాలనే పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దిగజార్చేలా.. నిహారిక గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడారని , వెంటనే అనుదీప్ ను అరెస్టు చేయాలి అని వెంకటకృష్ణ కోరారు.. దీంతో స్పందించిన పోలీసులు అనుదీప్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

1100 కిలోమీటర్ల ప్రయాణం..అనుదీప్ అరెస్ట్..

Advertisement

ఇక దీంతో అనుదీప్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ లో ఉన్నట్లు గుర్తించి ఏప్రిల్ 14న అక్కడ తన తండ్రితో కలిసి పార్కులో ఉన్న అనుదీప్ ను పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1100 కిలోమీటర్లు ప్రయాణించి అనుదీప్ ను అరెస్ట్ చేసి కాకినాడకు రైలులో తరలించారు.

క్షమాపణలు చెప్పిన అనుదీప్..

ఇక దీంతో వివాదం ముదురుతోందని గమనించిన అనుదీప్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్షమాపణలు కూడా చెప్పాడు . ఎవరిని ఉద్దేశించి కించపరచడం తన అభిప్రాయం కాదని.. కామెడీ కోసమే అలా మాట్లాడాను అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ అతను చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటడం వల్లే అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

బెయిల్ మంజూరు చేసిన మెజిస్ట్రేట్..

Advertisement

ఇకపోతే కాకినాడ పోలీసులు గురువారం రాత్రి 9 గంటలకు కాకినాడ 3వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి శ్రీదేవి ముందు హాజరుపరచగా.. రాత్రి 12 గంటల వరకు విచారణ జరిగింది. అయితే వాదోపవాదానాలు విన్న జడ్జి శ్రీదేవి పదివేల రూపాయల పూచీకత్తుతో అనుదీప్ ను బెయిల్ మీద విడుదల చేశారు. పైగా నిబంధనల ప్రకారం విచారణకు సహకరించాలి అని కూడా ఆదేశించారు. దీంతో కాకినాడ కోర్టులో ఊరట కలిగిందని అనుదీప్ ఊపిరి పీల్చుకునే లోపే సజ్జనార్ రూపంలో మరో విపత్తు వచ్చి చేరింది.

also read:విజయ్ పక్కన బాడీగార్డ్ చేతిలో ఉండే నల్లటి సూట్ కేస్ గమనించారా.. దీని పర్పస్ తెలిస్తే షాక్!

సడన్ షాక్ ఇచ్చిన సజ్జనార్..

ప్రత్యేకించి మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అనుదీప్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అయిన వీసీ సజ్జనార్ ను కలిసి మరీ అనుదీప్ పై ఫిర్యాదు చేశారు. మెగా హీరోలను, మెగా డాటర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్లకు అందిన ఫిర్యాదు పై సజ్జనార్ స్పందిస్తూ.. వెంటనే విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×