E-Paper
Advertisement

LFP బ్యాటరీ vs NMC బ్యాటరీ.. ఏ బైక్ కు ఏ బ్యాటరీ బెస్ట్ అంటే?

LFP బ్యాటరీ vs NMC బ్యాటరీ..  ఏ బైక్ కు ఏ బ్యాటరీ బెస్ట్ అంటే?
Advertisement

LFP vs NMC Explained: ఎలక్ట్రిక్ స్కూటర్,  బైక్ కొనాలని అనుకునే సమయంలో చాలామంది రేంజ్, ధర, ఫీచర్లపై ఎక్కువ ఫోకస్ పెడతారు. కానీ, అసలు కీలకమైన అంశం బ్యాటరీ. వెహికల్ పనితీరు, దీర్ఘకాలిక మన్నిక, ఖర్చు లాంటి అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా రెండు రకాల బ్యాటరీల పేర్లు వినిపిస్తాయి. వాటిలో ఒకటి LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్), NMC (నికెల్ మాంగనీస్ కోబాల్ట్). ఇవి రెండూ లిథియం-అయాన్ బ్యాటరీలే అయినప్పటికీ, వాటి లక్షణాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇంతకీ వీటి మధ్య తేడాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ గురించి..

ముందుగా LFP గురించి తెలుసుకుందాం. ఇది భద్రత, మన్నిక విషయంలో బలంగా ఉంటుంది. మన దేశంలో వాహనాలు ఎక్కువగా ఎండలో, దుమ్ములో, వర్షంలో ప్రయాణిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో బ్యాటరీ వేడి తట్టుకోవాలి. LFP బ్యాటరీలు ఈ విషయంలో చాలా నమ్మకంగా పనిచేస్తాయి. అవి ఎక్కువగా వేడెక్కకుండా ఉంటాయి. ప్రమాదాల అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే చాలా కంపెనీలు దీన్ని సురక్షితమైన ఎంపికగా ప్రచారం చేస్తున్నాయి.

Advertisement

LFP బ్యాటరీలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. అంటే, మీరు వాహనాన్ని ఎన్నో సంవత్సరాలు ఉపయోగించినా పనితీరు స్థిరంగా ఉంటుంది. రోజూ చిన్న దూరాలు ప్రయాణించే వారికి, ఎక్కువ కాలం ఇబ్బంది లేకుండా ఉపయోగించాలనుకునే వారికి ఈ బ్యాటరీ బెస్ట్ ఆప్షన్. మెయింటెనెన్స్ ఖర్చు కూడా దీర్ఘకాలంలో తగ్గే అవకాశం ఉంటుంది.

NMC (నికెల్ మాంగనీస్ కోబాల్ట్) బ్యాటరీ గురించి..

ఇక NMC బ్యాటరీల విషయానికి వస్తే, ఇవి పనితీరు, తక్కువ బరువు విషయంలో ముందుంటాయి. ఈ బ్యాటరీలు చిన్న పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేస్తాయి. అందువల్ల వాహనం తేలికగా ఉంటుంది. వేగంగా స్పందిస్తుంది. ట్రాఫిక్‌ లో సులభంగా నడపడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మంచి స్పీడ్, పవర్ కోరుకునే వారికి NMC బ్యాటరీలు సరిపోతాయి.

Advertisement

NMC బ్యాటరీల వల్ల స్కూటర్, బైక్ డిజైన్ కూడా కాంపాక్ట్‌ గా ఉంటుంది. పెట్రోల్ వాహనం నుంచి EVకి మారుతున్న వారికి ఇది మరింత నేచురల్ గా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ పనితీరు లక్ష్యంగా పెట్టుకున్న బ్రాండ్‌లు ఇప్పటికీ NMCని ఉపయోగిస్తున్నాయి.

రెండింటిలో ఏది బెస్ట్ బ్యాటరీ?

LFP, NMC బ్యాటరీలలో ఏది మంచిదంటే.. పూర్తిగా వినియోగంపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ ప్రయాణం కోసం, తక్కువ ఖర్చుతో, ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటే LFP మంచిది. భద్రత, మన్నిక, విశ్వసనీయత దీని ప్రధాన బలాలు. మరోవైపు, వేగం, తేలిక, ఆకర్షణీయమైన పనితీరు కోరుకుంటే NMC సరైన ఎంపిక. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఉత్తేజకరంగా చేస్తుంది. బ్యాటరీ ఖర్చు కూడా చాలా కీలకం. ఒక ఎలక్ట్రిక్ వాహనం మొత్తం ధరలో బ్యాటరీకే ఎక్కువగా ఉంటుంది. ఏ కెమిస్ట్రీని ఎంచుకుంటున్నారో అది భవిష్యత్తు ఖర్చులను కూడా ప్రభావితం చేస్తుంది.

Read Also: కారు రూఫ్ డిజైన్‌ లో గీతలు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదు!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×