E-Paper
Advertisement

Akhanda 2 Day1 Collections : అడ్వాన్స్ బుకింగ్‌లో బాలయ్య ఊచకోత.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూళ్లు అంటే?

Akhanda 2 Day1 Collections : అడ్వాన్స్ బుకింగ్‌లో బాలయ్య ఊచకోత.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూళ్లు అంటే?
Advertisement

Akhanda 2 Day1collections : నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన ఆఖండ 2 (Akhanda 2)సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ డిసెంబర్ 12వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. దీంతో మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రసారం కానున్న నేపథ్యంలో భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. డిసెంబర్ 12వ తేదీ అఖండ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిన్న సినిమాలన్నీ కూడా తప్పుకోవడంతో భారీగా ప్రీమియర్లను ప్రసారం చేయనున్నారు.

మొదటిరోజే రూ.50 నుంచి 55 కోట్లు?

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 12వ తేదీ ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో సుమారు 5 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయని తెలుస్తోంది. ఇక ప్రీమియర్లకు నైజాం ఏరియాలో ఒక్కో టికెట్ ధర 600 పెంచుతూ ప్రభుత్వం అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే. ఇలా అడ్వాన్స్ బుకింగ్ తో పాటు ప్రీమియర్లను కలుపుకుంటే అఖండ 2 మొదటి రోజే భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించబోతుందని తెలుస్తోంది. ఇలా ప్రీమియర్ షోలతో పాటు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలుపుకుంటే ఈ సినిమా మొదటి రోజే 50 నుంచి 55 కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

అఖండ 2 వాయిదా పడటం ప్లస్ అయ్యిందా?

Advertisement

ఇలా బాలకృష్ణ సినిమా కెరియర్ లోనే ఈ స్థాయిలో ఏ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదని చెప్పాలి. అయితే అఖండ 2 సినిమా ఐదో తేదీన వాయిదా పడటం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరిగిపోయాయి.. మరి కొన్ని గంటలలో బాక్సాఫీస్ బాలయ్య అఖండ తాండవం చూడబోతోందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు కేవలం నైజం ఏరియాలో మాత్రమే కాకుండా సీడెడ్, ఓవర్సీస్ లో కూడా భారీగా ఆదరణ లభిస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించబోతుందో తెలియాల్సి ఉంది.

సనాతన ధర్మ పరిరక్షణ

Advertisement

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ భారీగా అంచనాలను పెంచేశారు. ఇక ఇటీవల ఈ సినిమా విడుదల సందర్భంగా టీజర్ విడుదల చేయడంతో ఈ వీడియో కాస్త రెట్టింపు స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సంయుక్త మీద నటించగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Chiranjeevi: రతన్ టాటాను గుర్తు చేస్తున్నారు.. ఆనంద్ మహేంద్ర పై చిరు ట్వీట్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×