E-Paper
Advertisement

Chiranjeevi: రతన్ టాటాను గుర్తు చేస్తున్నారు.. ఆనంద్ మహేంద్ర పై చిరు ట్వీట్!

Chiranjeevi: రతన్ టాటాను గుర్తు చేస్తున్నారు.. ఆనంద్ మహేంద్ర పై చిరు ట్వీట్!
Advertisement

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ వ్యాపారవేత్త మహేంద్ర గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర(Anand Mahindra) పై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల వీరిద్దరూ తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం చిరంజీవి ఆనంద్ మహేంద్రతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆనంద్ మహేంద్ర పై ప్రశంసలు కురిపించారు.

రతన్ టాటా గారు గుర్తొస్తారు..

ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. డియర్ ఆనంద్ మహేంద్ర.. మీరు ఎంతో వినయంతో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలవారు. మీరు ఎంతో మందికి ఆదర్శనీయం. మీరు ఎన్నో విషయాలలో రతన్ టాటా గారిని గుర్తు చేస్తున్నారు. రతన్ టాటా గారు తన విలువలతో గొప్ప వ్యక్తిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మీరు కూడా అచ్చం రతన్ టాటా (Ratan Tata)గారిలాగే అనిపిస్తారని, సేవా కార్యక్రమాల పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిబద్ధత ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని తెలియజేయడమే కాకుండా ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ..

Advertisement

ఇక ఆనంద్ మహేంద్ర ప్రముఖ వ్యాపారవేత్తగా మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడమే కాకుండా తనదైన శైలిలోనే అందరికీ సహాయ సహకారాలను అందిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక చిరంజీవితో పాటు మరికొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Advertisement

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . ఈయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల చేయబోతున్న నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే .ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి . ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే . ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన మీసాల పిల్ల సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: Annagaru Vostaru: అన్నగారు వస్తారు మూవీకి బిగ్ షాక్… రిలీజ్ వద్దు అంటూ హై కోర్టు స్టే

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×