E-Paper
Advertisement

Indigo Effect: హైదరాబాద్ నుంచి విమాన టికెట్ ధర.. అక్షరాలా రూ.లక్ష!

Indigo Effect: హైదరాబాద్ నుంచి విమాన టికెట్ ధర.. అక్షరాలా రూ.లక్ష!
Advertisement

Hyd to Bhopal Flight Ticket 1.3 L: దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ అర్థరాత్రి వరకు విమానాల రద్దు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ క్రైసిన్ ను ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రద్దీగా ఉన్న మార్గాల్లో విమాన టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. హైదరాబాద్ నుంచి భోపాల్‌కు ఎయిర్ ఇండియా టికెట్ ధర ఏకంగా రూ.1.3 లక్షలు పలికింది. ఈ ఛార్జీతో కేవలం ఒకే సీటు అందుబాటులో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్ లాంటి ముఖ్య నగరాలకు వెళ్లే ఇండిగో సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎయిర్‌ లైన్ వెబ్‌ సైట్లు,  ట్రావెల్ పోర్టల్స్ లో విమానాల టికెట్ ఛార్జీలు భారీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పలు నగరాలకు పెద్ద సంఖ్యలో విమానాలు నడుపుతున్న ఇండిగో.. అన్ని విమానాలను రద్దు చేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తింది.

హైదరాబాద్-విశాఖ విమాన టికెట్ ఛార్జీలు

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మార్గంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఒకే ఒక విమానం అందుబాటులో ఉంది. ముంబై,  బెంగళూరు ద్వారా టూ స్టాప్‌ల సర్వీసుకు తొమ్మిది గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఎకానమీ ఛార్జీ రూ.69,787గా ఉంది. భువనేశ్వర్‌ కు, తొమ్మిది గంటల వన్ స్టాప్ ప్రయాణానికి స్వల్పంగా రూ.27,417గా ఉంది. హైదరాబాద్-విజయవాడ టికెట్ ధర రూ.28 వేలు ఉంది.

హైదరాబాద్-ఢిల్లీ విమాన టికెట్ ఛార్జీలు

Advertisement

ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు నాన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ.12,894గా ఉంది. అత్యంత ఖరీదైన నాన్ స్టాప్ టికెట్ ధర రూ.   29,524గా ఉంది. ముంబై సెక్టార్‌లో 12 గంటల టూ స్టాప్ సర్వీస్‌కు తక్కువ టికెట్ ధర రూ. 32,095గా ఉండగా, ఐదు గంటల వన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ. 59,482గా ఉంది.  అదే మార్గంలో మరో వన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ.  70,329కి చేరుకుంది. ఒకానొక సమయంలో హైదరాబాద్‌-ఢిల్లీ విమాన టికెట్‌ ధర రూ. రూ.89 వేలకు చేరింది. ఢిల్లీ-ముంబై విమాన టికెట్ ధర రూ.40 వేలకు చేరింది.

Read Also: ప్రయాణీకులకు ఇండిగో క్షమాపణలు, రీఫండ్ పై కీలక ప్రకటన!

Advertisement

ఇవాళ అర్థరాత్రి వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండవని ఇండిగో ప్రకటించిన నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రద్దీ రూట్లలో గంట గంటకు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా ప్రయాణీకులు విమానాశ్రయాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల అత్యవసర ప్రయాణాలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ధరల నియంత్రణ విషయంలో చేతులెత్తేసింది.

Read Also: ఇండిగో ఇబ్బందుల దృష్ట్యా DGCA కీలక నిర్ణయం.. ఆ నిబంధనల్లో మార్పులు!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×