E-Paper
Advertisement

Akhanda 2 Event : పెళ్లయిన తర్వాత బాడీలో మార్పులు సహజం, నటి పూర్ణాపై బోయపాటి ఆసక్తికర కామెంట్స్

Akhanda 2 Event : పెళ్లయిన తర్వాత బాడీలో మార్పులు సహజం, నటి పూర్ణాపై బోయపాటి ఆసక్తికర కామెంట్స్
Advertisement

Akhanda 2 Event : భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీనుకి విపరీతమైన గుర్తింపు తీసుకువచ్చిన సినిమా అఖండ. మామూలుగా బోయపాటి శ్రీను ఎంతమంది హీరోలతో కలిసి పనిచేసిన కూడా, బాలకృష్ణతో సినిమా అంటే ఒక రకమైన హై ఉంటుంది. అలానే ఫోన్ కాల్ వచ్చినట్టు బాలకృష్ణ కోసం కష్టపడుతుంటాడు బోయపాటి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం అఖండ. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో నటి పూర్ణ ఒక కీలకపాత్రను పోషించింది. అఖండ సినిమాలో కూడా పూర్ణ నటించారు. అయితే ఆ పాత్ర అఖండలో చనిపోకుండా ఉంటుంది. ఇదే విషయాన్ని పూర్ణ మాట్లాడుతూ కూడా బోయపాటి శ్రీనుకి ధన్యవాదాలు చెప్పారు. అయితే నటి పూర్ణ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు బోయపాటి శ్రీను.

అందుకే బాడీలో మార్పులు 

Advertisement

నటి పూర్ణ చాలా మంచి గా నటిస్తుంటారు. పెళ్లయిపోవడం వలన సహజంగా బాడీలో మార్పులు రావడం అనేది జరుగుతుంది. అందుకే మీ అందరికీ నటి పూర్ణ కొంచెం లావుగా కనిపిస్తున్నారు. చెప్పొచ్చా లేదో కానీ ఆవిడ ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అంటూ స్టేజ్ పైన చెప్పారు బోయపాటి శ్రీను. మరోవైపు ఇంకో బేబీని క్యారీ చేస్తున్నట్లు కూడా చెప్పింది పూర్ణ.

ఇక పూర్ణ విషయానికి వస్తే రవిబాబు తీసిన చిత్రాల్లో మంచి గుర్తింపు సాధించుకుంది. అంతేకాకుండా డీ అనే రియాలిటీ షో కూడా జడ్జ్ గా వ్యవహరించి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు పూర్ణ. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అఖండ 2 సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో డిసెంబర్ 5న సినిమా చూశాక అర్థమవుతుంది.

ప్రామిసింగ్ కంటెంట్ 

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయటంలో ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయి అని పిస్తుంది. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో డిసెంబర్ 5న తెలుస్తుంది.

Also Read: Akhanda 2 Event : నాకు చాలా వర్క్స్ ఉన్నాయి కానీ ఒకరే భార్య, పవన్ కళ్యాణ్ కు బాలయ్య కౌంటర్?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×