NBK 111: నందమూరి బాలకృష్ణ ఒకవైపు ఆఖండ 2 సినిమా పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు తన కొత్త సినిమా పనులను కూడా ప్రారంభిస్తున్నారు. అఖండ 2(Akhanda 2) డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ(Balakrishna) తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని(Gopi Chand Malineni) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ తెలియజేస్తూ సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు.
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరొక పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో బాలకృష్ణ మహారాజులా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ పోస్టర్ విడుదల చేస్తూ.. యుద్ధభూమి శక్తివంతమైన రాజుకు స్వాగతం పలుకుతోంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంటుందని, ఈ చారిత్రక గర్జన చరిత్ర పునాదులను కదిలించి కొత్త అధ్యయనానికి నాంది పలకడానికి సిద్ధంగా ఉంది అంటూ ఈ పోస్టర్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఇందులో బాలకృష్ణ మహారాజుగా కనిపించబోతున్నారని ,ఈ సినిమా చారిత్రాత్మక అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది.
ఇక ఈ పోస్టర్ స్పష్టంగా గమనిస్తే బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ పోస్టర్ లో ఇద్దరూ బాలకృష్ణలే కనిపించడంతో ఈ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారా? లేకుంటే మరేదైనా విభిన్న పాత్రలలో నటిస్తున్నారా? అనే విషయాల పట్ల స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు రామానాయుడు స్టూడియోలో ఎంతో ఘనంగా జరగనున్నాయి.
The battlefield rises to salute its MIGHTIEST KING 🔥#NBK111 Muhurtham Today 🦁
This HISTORICAL ROAR is set to shake the very foundations of history and script a new chapter 💥
GOD OF MASSES #NandamuriBalaKrishna #Nayanthara @megopichand @Venkataskilaru @vriddhicinemas… pic.twitter.com/yslTXW3DL6
— NBK 111 (@NBK111Movie) November 26, 2025
ఇకపోతే ఈ సినిమాలో నటిగా నయనతార (Nayanatara) నటిస్తున్నారు. ఈమె మహారాణి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈమెకు సంబంధించి ఒక స్పెషల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా నయనతార మహారాణిగా సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలకృష్ణతో గోపీచంద్ భారీ సినిమానే ప్లాన్ చేశారని ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇక ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి సందడి చేశారు. ఇక తాజాగా NBK 111 లో బాలయ్య ద్విపాత్రాభినయంలో సందడి చేయబోతున్నారని తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తేనే స్పష్టమవుతుంది.
Also Read: Bhagya shri: ఆ ఒక్క కారణంతోనే కింగ్డమ్ కు కమిట్ అయ్యాను.. భాగ్య శ్రీ