E-Paper
Advertisement

Bhagya shriBorse: ఆ ఒక్క కారణంతోనే కింగ్డమ్ కు కమిట్ అయ్యాను.. భాగ్య శ్రీ

Bhagya shriBorse: ఆ ఒక్క కారణంతోనే కింగ్డమ్ కు కమిట్ అయ్యాను.. భాగ్య శ్రీ
Advertisement

Bhagya shri Borse: భాగ్యశ్రీ బోర్సే త్వరలోనే ఆంధ్ర కింగ్ తాలుకా (Andhra King Taluka)అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే నటి భాగ్యశ్రీ బోర్సే(Bhagya Shri Borse) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కింగ్డమ్ సినిమా(King Dom Movie) గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ వంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే అనుకున్న విధంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

కింగ్డమ్ 2 లో ప్రాధాన్యత ఎక్కువ..

ఇకపోతే తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కింగ్డమ్ సినిమా మాకు కాస్త డిసప్పాయింట్ కలిగించింది. మీకు సంబంధించి కొన్ని లవ్ సీన్స్ తీసేశారు అలాగే పాట కూడా తీసేయడంతో మేము డిసప్పాయింట్ అయ్యాము. మీకు ఎలా అనిపించింది అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు భాగ్యశ్రీ సమాధానం చెబుతూ నిజానికి తాను ఈ సినిమాకు కమిట్ అవ్వడానికి కారణం ఈ సినిమా రెండు భాగాలుగా రావడమేనని తెలిపారు. కింగ్డమ్ 2(King dom 2) లో నా పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది. కింగ్డమ్ మొదటి భాగంలో నా పాత్ర కేవలం ఇంట్రడ్యూస్ చేసే వరకు మాత్రమే పరిమితం అవుతుందని పార్ట్ 2 లో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండటంవల్లే ఈ సినిమాకు సంతకం చేశానని భాగ్యశ్రీ వెల్లడించారు.

మరింత ఆలస్యంగా కింగ్డమ్ 2..

Advertisement

ఇక ఈమె వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే సీక్వెల్ సినిమా భారీగానే ఉండబోతుందని స్పష్టమవుతుంది. అయితే ఈ సీక్వెల్ రావడానికి కాస్త సమయం పడుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి చేసిన అనంతరమే కింగ్డమ్ 2 చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక భాగ్యశ్రీ ఇటీవల కాంతా సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ..

Advertisement

ఈ క్రమంలోనే ఈమె ఆశలన్నీ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా పైనే ఉన్నాయని చెప్పాలి. ఇందులో ఈమె మహాలక్ష్మి అనే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించబోతున్నానని తెలియజేశారు. రామ్ పోతినేని(Rampothineni) హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక అభిమాని కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు ఉపేంద్ర కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అయినా భాగ్యశ్రీ కి సక్సెస్ అందిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Actor Shivaji: సినిమా టికెట్ల రేట్లపై శివాజీ కామెంట్స్..రూ.100 పెంచితేనే ప్రశ్నించాల అంటూ!

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×