E-Paper
Advertisement

Balakrishna: 65 ఏళ్లల్లో కూడా జోరు పెంచిన బాలయ్య.. ఆ లైనప్ ఏంటి మావా!

Balakrishna: 65 ఏళ్లల్లో కూడా జోరు పెంచిన బాలయ్య.. ఆ లైనప్ ఏంటి మావా!

Balakrishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ. మాస్ ఆఫ్ గాడ్, నటసింహ బాలకృష్ణ (Balakrishna). 65 ఏళ్ల వయసులో కూడా వరుస ప్రాజెక్టులు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య.. ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులు ప్రకటించి.. యంగ్ హీరోలకి కూడా షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే కాంబినేషన్స్ ను బాలకృష్ణ సెట్ చేశారనే చెప్పాలి. ఈ కాంబినేషన్లు వరుసగా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తాయని.. అప్పుడే అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి బాలకృష్ణ నటించబోతున్న ఆ ప్రాజెక్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాలకృష్ణ లైనప్ అదుర్స్.

అసలు విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే బాలకృష్ణ మరో నలుగురు దర్శకులను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఆ దర్శకులు ఎవరో కాదు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, కొరటాల శివ , బాబీ కొల్లి..

ఇకపోతే ఈ దర్శకుల విషయానికి వస్తే.. ఇదివరకే అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో చేయబోయే చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనున్నారు.

అలాగే బాబి కొల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు బాలకృష్ణ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో నాగవంశీ నిర్మించిన చిత్రం ‘డాకు మహారాజ్’. అందుకే ఈ కాంబోలో మరో చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నారట నాగ వంశీ. ప్రస్తుతం చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. బెంగాల్ మాఫియా డాన్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత బాబి కొల్లి బాలయ్య ప్రాజెక్టు పైకి షిఫ్ట్ కానున్నారట.

అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.అలాగే కొరటాల శివతో బాలకృష్ణ సినిమా చేయబోతున్నారు. కథ నచ్చి కొరటాలతో సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారటఈ చిత్రాన్ని అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే బాలకృష్ణ లైనప్ చూసి అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

also read:Mahesh Babu: “నువ్వే నా జీవితం”.. భార్యకు స్పెషల్ విషెస్ తెలియజేసిన మహేష్ బాబు!

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×