E-Paper
Advertisement

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్..బంగ్లాదేశ్ కు 10 రూపాల్లో న‌ష్టాలు..ఇక స‌ర్వ‌నాశ‌న‌మే

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్..బంగ్లాదేశ్ కు 10 రూపాల్లో న‌ష్టాలు..ఇక స‌ర్వ‌నాశ‌న‌మే
Advertisement

T20 World Cup 2026:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించేసింది. ఐసీసీ ఇచ్చిన రెండు రోజుల గడువును సద్వినియోగం చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడబోమని ప్రకటించేసింది. ఇవాళ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియాలో పర్యటించడం పైన చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అనంతరం బంగ్లాదేశ్ క్రీడా సలహాదారులు ఆసిఫ్ నజురుల్ కీలక ప్రకటన చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో తమ జట్టు పాల్గొనడం లేదని ఐసిసికి క్లారిటీ ఇచ్చారు.

Also Read: RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

టి20 ప్రపంచ కప్ ఆడడంపై బంగ్లాదేశ్ క్లారిటీ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమని తాజాగా బంగ్లాదేశ్ ప్రకటించేసింది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటిస్తే, ప్లేయర్లకు ప్రాణహాని ఉంటుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. అందుకే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ను బై కాట్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. క్రికెట్ కంటే తమ ఆటగాళ్ల ప్రాణాలు ముఖ్యమని.. ఇలాంటి పరిస్థితులలో ఇండియాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు పర్యటిస్తే, అత్యంత ప్రమాదకరమని బోర్డు సభ్యులు వెల్లడించారు. అందుకే ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.

బంగ్లాదేశ్ కు జరిగే నష్టాలు ఇవే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ కు ఇక కష్టాలు మొదలుకానున్నాయి. ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగినందుకు గాను రెండు మిలియన్లు అంటే ఇండియన్ రూపాయలలో 16 కోట్లు ఐసీసీకి చెల్లించాలి. అలాగే ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నందుకు గాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే 4.1 కోట్లు రావన్న మాట. అదేవిధంగా ఐసీసీ వార్షిక ఆదాయంలో కూడా కోత విధించే ప్రమాదం ఉంటుంది. ప్లేయర్లకు కూడా భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది. వాళ్లకు ఇచ్చే మ్యాచ్ ఫీజులు, బోనస్, ప్లేయర్ల మార్కెట్ విలువ అమాంతం పడిపోనుంది. ఇక ఐసీసీ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ర్యాంకింగ్ కూడా పడిపోనుంది. భవిష్యత్తులో మళ్లీ ఐసీసీ టోర్నమెంట్ ఆడాలంటే కచ్చితంగా క్వాలిఫైయర్ రౌండ్లు వాడాల్సి ఉంటుంది. అంటే జింబాబ్వే, నేపాల్ జట్లు ఆడినట్లు బంగ్లాదేశ్ ఇకపై ఆడాలి. ఇటు ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోనున్నాయి. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు.. బంగ్లాదేశ్ కు అడుగడుగున అగ్నిగుండమే. భవిష్యత్తులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఎత్తేసే ప్రమాదం కూడా ఉండే ఛాన్సులు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. బీసీసీఐ బోర్డుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు.

Advertisement

Also Read: Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×