E-Paper
Advertisement

కొరటాల శివతో బాలయ్య సినిమా కన్ఫర్మ్..పూర్తి డీటెయిల్స్ ఇవే!

కొరటాల శివతో బాలయ్య సినిమా కన్ఫర్మ్..పూర్తి డీటెయిల్స్ ఇవే!
Advertisement

Koratala Siva -Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల అఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopi Chand Malineni) దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగానే బాలయ్య మరిన్ని సినిమాలను లైన్ లో పెట్టారు. ఈయన వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కొరటాల శివతో కూడా సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య ..

కొరటాల శివ ఒక అద్భుతమైన కథను బాలకృష్ణకు చెప్పగా బాలయ్య దాదాపు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. కొరటాల చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఈ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.

యాక్షన్ నేపథ్యంలో కొరటాల బాలయ్య..

Advertisement

కొరటాల శివ బాలయ్యకు అనుగుణంగా ఒక యాక్షన్ స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడమే కాకుండా పూజ కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నట్టు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక కొరటాల శివ సినిమాల విషయానికి వస్తే ఈయన ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఆలస్యంగా దేవర 2..

Advertisement

ఇలా దేవర సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో దేవర 2(Devara 2) ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ బాలకృష్ణతో సినిమా చేయటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కొరటాల సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీ కాబోతున్నట్టు సమాచారం.

Also Read: నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్ లో ‘రాకా ‘..కీలక అప్డేట్ ఇచ్చిన అభ్యంకర్!

Related News

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

Big Stories

Advertisement
×