Raakaa Film: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం రాకా(Raaka). ఈ సినిమా 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 70% షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని సమాచారం. విఎఫ్ఎక్స్ పనుల కోసమే అధిక సమయం కేటాయించబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ విభిన్నమైన లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.
ఈ సినిమా గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్(Sai Abhyankar) ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా మ్యూజిక్ కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండే విధంగా చిత్ర బృందం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సాయి తెలియజేశారు.
ఈ సందర్భంగా సాయి అభ్యంకర్ మాట్లాడుతూ.. రాకా సినిమా మ్యూజిక్ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని భావించాము అందుకోసమే ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ సింగర్స్ అలాగే, లిరిసిస్ట్ లతో కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు ఈయన తెలియజేశారు. ఇప్పటికే అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చిందని కచ్చితంగా ప్రతి ఒక్కరికి సరికొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన అల్లు అర్జున్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఇంటర్నేషనల్ లెవెల్ లో రాకా..
అల్లు అర్జున్ గారికి సంగీతం పట్ల చాలా మంచి నాలెడ్జ్ ఉందని ఆయన ఇచ్చిన సలహాలు తనకు చాలావరకు హెల్ప్ అయ్యాయి అంటూ సాయి అభ్యంకర్ తెలియజేశారు. ఇలా సాయి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లడానికి అట్లీ భారీగా ప్లాన్ చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిథి మారన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ విజువల్స్ తో హాలీవుడ్ సినిమాని తలపించేలా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా నటి దీపికా పదుకొనే కీలకపాత్రలో కనిపించబోతున్నారు.
Also Read: కేజిఎఫ్ 3 పై యష్ బిగ్ అప్డేట్ .. ఖచ్చితంగా ఉంటుంది కానీ?