E-Paper
Advertisement

Viral Video: కంత్రి దొంగ.. సూట్‌లో గెస్టుగా వచ్చి.. నీటుగా రూ.5 లక్షలు ఎత్తుకెళ్లాడు!

Viral Video: కంత్రి దొంగ.. సూట్‌లో గెస్టుగా వచ్చి.. నీటుగా రూ.5 లక్షలు ఎత్తుకెళ్లాడు!
Advertisement

Viral Video: ఒకప్పుడు దొంగలు ఎవరు లేని సమయంలో రాత్రిళ్లు చోరీలకు పాల్పడేవారు. జనాలు కనిపిస్తే వెంటనే ఆమడదూరం పారిపోయేవారు. అయితే ప్రస్తుతం రోజుల్లో దొంగలు ట్రెండ్ మార్చినట్లు తెలుస్తోంది. పట్టగలు అందరి కళ్లముందే ధర్జాగా చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన ఓ దొంగతనం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ పంక్షన్ హాల్ లో చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉండగానే.. ఏమాత్రం బెరుకులేకుండా రూ.5 లక్షలు దోచుకెళ్లిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..

నోయిడాలోని సెక్టార్ 49లో ఉన్న డైమండ్ క్రౌన్ బ్యాంకెట్ హాల్‌లో ఈ చోరీ ఘటన జరిగింది. బ్యాంకెట్ హాల్‌లో ఒక నిశ్చితార్థ వేడుక (Engagement Ceremony) జరుగుతుండగా.. రెండు కుటుంబాల వారు సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఈ క్రమంలో సూటు – బూటుతో అతిథిలా ఫంక్షన్ కు వచ్చిన ఓ వ్యక్తి.. ఎవరికీ అనుమానం రాకుండా కాసేపు అక్కడ తిరుగుతూ, భోజనం కూడా చేశాడు.

రూ.5 లక్షలు చోరీ..

Advertisement

ఈ క్రమంలో వధువు కుటుంబ సభ్యులు నగలు, డబ్బు ఉన్న బ్యాగును ఒక చోట ఉంచి వేడుకలో బిజీగా ఉండటాన్ని ఉండటాన్ని నిందితుడు గమనించాడు. అదును చూసి ఆ బ్యాగును సైలెంట్ గా తీసుకుని అక్కడి నుండి జారుకున్నాడు. ఆ బ్యాగులో దాదాపు రూ.5 లక్షల విలువైన నగలు, డబ్బు ఉన్నట్లు సమాచారం.

వైరల్ వీడియో

కొద్దిసేపటి తర్వాత వధువు కుటుంబ సభ్యులు.. బ్యాగ్ కోసం చూడగా పెట్టిన ప్లేసులో అది కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ బాధితులు.. బ్యాంకెట్ హాల్‌లోని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. అందులో నిందితుడు ఎలాంటి హడావిడీ లేకుండా సాఫీగా బ్యాగును దొంగిలించి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ చోరీ జరిగిన తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: ‘చాలా క్యూట్‌ ఉన్నారు.. మీ వయసెంత’.. మహిళతో ర్యాపిడో డ్రైవర్ పిచ్చివేషాలు!

రంగంలోకి పోలీసులు..

బాధితుల ఫిర్యాదు మేరకు.. నోయిడా సెక్టార్ 49 పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుపుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతిథుల రూపంలో వచ్చే అవకాశం ఉన్నందున విలువైన వస్తువులను తమ వద్దే జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నగలు, డబ్బు భద్రపరిచే బ్యాగులు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Also Read: Air Coolers: ప్లాస్టిక్ vs ఐరన్ కూలర్లు.. మెరుగైన కూలింగ్‌కు.. రెండింటిలో ఏది బెస్ట్?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×