E-Paper
Advertisement

Balakrishna- Akhanda 2: అఖండ 2 రిలీజ్ తర్వాత బాలయ్య ఫస్ట్ రియాక్షన్.. అభిమానితో ఏం అన్నాడంటే?

Balakrishna- Akhanda 2: అఖండ 2 రిలీజ్ తర్వాత బాలయ్య ఫస్ట్ రియాక్షన్.. అభిమానితో ఏం అన్నాడంటే?
Advertisement

Balakrishna- Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో ఉన్న తెలుగు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆఖండ సినిమాని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

సినిమా మాత్రం వేరే లెవెల్..

ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది .ఈ క్రమంలోనే ఫిలడెల్ఫియాలో ఉన్న అభిమానితో స్వయంగా బాలకృష్ణ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. అఖండ సినిమా విడుదలైన తర్వాత మొదటిసారి బాలకృష్ణ ఈ సినిమా గురించి స్పందిస్తూ మాట్లాడటంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఫిలడెల్ఫియాలో NBK ఫ్యాన్స్ షో తర్వాత ఒక అభిమాని బాలయ్యకు ఫోన్ చేశారు. ఇక బాలయ్య కు ఫోన్ చేసిన అభిమాని సినిమా అద్భుతంగా ఉంది అంటూ మాట్లాడారు.

థియేటర్లలో అఖండ తాండవమే..

Advertisement

సినిమా చాలా అద్భుతంగా ఉందని సినిమా చూస్తుంటే మామూలుగా అందరికీ గూస్ బంప్స్ వస్తాయి.. కానీ మాకు మాత్రం సినిమా చూస్తుంటే బాలయ్య బంప్స్, బోయపాటి బంప్స్, తమన్ బమ్స్ వచ్చేసాయి అంటూ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు దీంతో బాలకృష్ణ థాంక్యూ సో మచ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇంటర్వెల్ కు పదినిమిషాల ముందు నుంచి సినిమా మరో లెవల్ లో ఉందని నిజంగా అఖండ తాండవం చూపించారని అభిమాని తెలిపారు. ఒకవైపు యాక్షన్ తో పాటు మరోవైపు భక్తీ కూడా అద్భుతంగా చూపించారు అంటూ అభిమాని చెప్పడంతో బాలయ్య కూడా సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్యూ సో మచ్ ఓవరాల్ గా సినిమా బాగుంది కదా అంటూ బాలకృష్ణ అభిమానులతో మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఈ వీడియో చూసిన బాలయ్య అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. సాధారణంగా హీరోలు ఇలా అభిమానులతో మాట్లాడటానికి ఇష్టపడరు కానీ బాలకృష్ణ అభిమానులతో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలయ్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అఖండ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలకృష్ణ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేశారు కానీ ఈ సినిమా విడుదలకు ముందు వివాదం చోటు చేసుకోవడంతో బాలకృష్ణ పెద్దగా బయట ఎక్కడ కనిపించలేదు అలాగే మీడియా సమావేశాలలో కూడా పాల్గొనలేదు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటిసారి అభిమానితో ఇలా ఫోన్ కాల్ మాట్లాడటంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Akhanda 2 :కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా… అఖండ 2 మూవీపై హైకోర్టు సీరియస్

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×