U19 Asia Cup 2025: టీమిండియా స్టార్ క్రికెటర్, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) మరోసారి సెంచరీతో రెచ్చిపోయాడు. ఇవాళ ప్రారంభమైన అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ లో ( ACC Mens U19 Asia Cup 2025) ఏకంగా 171 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో 9 బౌండరీలు, 14 సిక్సర్లు ఉన్నాయి. అయితే 95 బంతుల్లోనే 171 పరుగులు సాధించిన వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఉద్దీష్ సూరి వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. అయితే వైభవ్ సూర్య వంశీ రెచ్చిపోవడంతో టీమిండియా కూడా భారీ స్కోర్ సాధించగలింది.
అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( ACC Mens U19 Asia Cup 2025) భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ యూఏఈ ( India U19 vs United Arab Emirates U19 ) జట్ల మధ్య మొట్ట మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది యూఏఈ. దీంతో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 56 బంతుల్లో తన సెంచరీ నమోదు చేసుకున్న వైభవ్ సూర్యవంశీ, ఆ తర్వాత 171 పరుగులకు వద్ద ఔట్ అయ్యాడు. జస్ట్ లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు వైభవ్. అయినప్పటికీ మిగిలిన ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా ఇద్దరూ అద్భుతంగా రాణించారు. ఇద్దరు ప్లేయర్లు చేరో 69 పరుగులు సాధించి, యూఏఈ ముందు 400 పరుగులకు పైగా టార్గెట్ పెట్టారు. దీంతో ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన టీమిండియా అండర్ 19 జట్టు, 6 వికెట్లు కోల్పోయి, 433 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో యూఏఈ గెలవాలంటే, 50 ఓవర్లలో 434 పరుగులు సాధించాల్సి ఉంటుంది.
అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( ACC Mens U19 Asia Cup 2025) భాగంగా మరోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఈ ఆదివారం అంటే డిసెంబర్ 14వ తేదీను జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ( Dubai) వేదిక కానుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్ లలో (Sony Sports Channel, Sony Liv App )
అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ మ్యాచ్ లు తిలకించవచ్చును. అండర్ 19 టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India U19 vs Pakistan U19, 5th Match, Group A) మధ్య ఆదివారం జరగబోయే మ్యాచ్ భారత కాలం మనం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది 50 ఓవర్ల మ్యాచ్ కావడంతో రాత్రి వరకు కొనసాగనుంది.
VAIBHAV SURYAVANSHI THANKING GOD WHEN HE COMPLETED HIS HUNDRED. ♥️🥹 pic.twitter.com/GQjs05GSJY
— Tanuj (@ImTanujSingh) December 12, 2025