E-Paper
Advertisement

Horror Thriller Movie OTT : దెయ్యంతో డీల్ మాట్లాడే తండ్రి… చెలరేగిపోయే పిశాచి…కూతురి ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ హారర్

Horror Thriller Movie OTT : దెయ్యంతో డీల్ మాట్లాడే తండ్రి… చెలరేగిపోయే పిశాచి…కూతురి ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ హారర్
Advertisement

Horror Thriller Movie OTT : ఇంటెన్స్ హారర్ సినిమాను చూడాలని ఉంటే, ఇప్పుడు మనం చప్పుకోబోయే ఇండోనేషియన్ మూవీని చూడాల్సిందే. ఈ సినిమాలో క్షుద్ర పూజలు, దెయ్యం పట్టడం వంటి భయంకరమైన సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇండోనేషియన్ హారర్ లవర్స్‌కి మస్ట్ వాచ్ మూవీ. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి పాపులారిటీ పొందింది ఈ సినిమా. దెయ్యం తో డీల్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది. అయితే హార్ట్ వీక్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2018లో వచ్చిన ఈ ఇండోనేషియా హారర్ మూవీ పేరు ‘మే ది డెవిల్ టేక్ యూ’ (May the Devil Take You). దీని ఒరిజినల్ టైటిల్ Sebelum Iblis Menjemput. ఈ సినిమాకి టిమో తజహజంతో దర్శకత్వం వహించారు. ఇందులో చెల్సియా ఇస్లాన్, పెవితా పియర్స్, రే సాహెతాపి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. దీనికి సీక్వెల్ 2020లో ‘మే ది డెవిల్ టేక్ యూ టూ’ అనే సినిమా కూడా విడుదలైంది. ఇది ఫ్యామిలీ సీక్రెట్స్, డిమోన్ పాసెషన్ తో సాగే స్కేరీ మూవీ. ఒంటరిగా కూడా అసలు చూడకూడని సినిమా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆల్ఫీ అనే యువతికి తన తండ్రి వింత వ్యాధితో చావు అంచున ఉన్నాడని తెలుస్తుంది. అతని అనారోగ్యానికి గల కారణాలను వెతుక్కుంటూ ఆమె తన తండ్రి పాత ఇంటికి వెళుతుంది. అక్కడ ఆమెకు కొన్ని నమ్మలేని విషయాలను తెలుసుకుంటుంది. తన తండ్రి గతంలో ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పుడు, ఒక క్షుద్ర మంత్రగత్తె సహాయంతో దెయ్యంతో ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తుంది. ఆ ఒప్పందం ప్రకారం, ఇప్పుడు ఆ దెయ్యం అతని కుటుంబంపై పగ తీర్చుకోవడానికి తిరిగి వచ్చిందని ఆమె గ్రహిస్తుంది.

ఇప్పుడు ఆ ఇంట్లో ఆల్ఫీతో పాటు ఆమె సవతి తల్లి, తోబుట్టువులు కూడా సమస్యల్లో చిక్కుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు ఆ దెయ్యం బారిన పడి వింతగా ప్రవర్తించడం, ప్రాణాలు కోల్పోవడం మొదలవుతుంది. చివరగా ఆ దెయ్యం శక్తుల నుండి ఆల్ఫీ బయట పడుతుందా ? ఆమె తన తండ్రిని బతికించుకుంటుందా ? అసలు ఆ దెయ్యంతో చేసుకున్న ఒప్పందం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Advertisement

Read Also : అప్పులు తీర్చడానికి 400 ఏళ్ల నాటి రాజభవనం అమ్మకం… తోలు తీసే ప్రేతాత్మ… ఐయండిబిలో టాప్ రేటింగ్

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×