Akhanda 2 Release Date: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2.. మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుందని అనుకున్న సమయంలో రిలీజ్ వాయిదా అని ప్రకటన రావడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అసలేం జరిగింది? ఎందుకు సినిమా విడుదల వాయిదా పడింది…? గతంలో బాలయ్య నటించిన ఏ సినిమాకు ఇలాంటి పరిస్థితి రాలేదు.. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి అని సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. నిజానికి ఇవాళ చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. కానీ బాలయ్య మూవీ కోసం వాయిదా పడ్డాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న ప్రశ్నలు జనాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలకు సమాధానం దొరికేసింది.. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ డేట్ ఎప్పుడన్నది ఒకసారి తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా అఖండ 2.. ఈ సినిమా ఇవాళ రిలీజ్ కావాల్సి ఉంది. ఫైనాన్షియల్ కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం, ‘అనివార్య కారణాల’ వల్ల వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త విన్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం కొన్ని గంటల్లోనే తమ అభిమాన హీరో సినిమాని చూడాలని అనుకున్న వాళ్ళ ఆశలు ఆవిరయ్యాయి. అనుకోని సంఘటనల వల్లే సినిమా వాయిదా వేసినట్లు నిర్మాతలు ప్రకటించిన కూడా.. మరి కొత్త డేట్ ఎప్పుడు అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీని 24 న మళ్లీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ కొత్త రిలీజ్ డేట్ పై త్వరలోనే ప్రకటన రావాల్సి ఉంది..
కేవలం కొన్ని గంటల్లోనే సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ సినిమా విడుదల కావడం లేదని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అనివార్య పరిస్థితుల కారణంగా అఖండ2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని మీకు తెలియజేయడానికి బరువెక్కిన హృదయంతో చింతిస్తున్నాము అని తెలిపింది. ఇది మాకు బాధాకరమైన క్షణం, సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభిమాని మరియు సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము నిజంగా అర్థం చేసుకున్నాము. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది..? ఒక స్టార్ హీరో మూవీ వాయిదా వెయ్యడం అంటే మామూలు విషయం కాదు.. సినిమా వాయిదా పడటానికి ఈ కారణం కూడా లేకపోలేదు. 14 రీల్స్ సోలో ప్రొడక్షన్ గతంలో చేసిన పొరపాట్లే కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి… ఆ నిర్మాణ సంస్థ గతంలో చేసిన సినిమాలకు ఫైనాన్షియల్ సమస్యలు ఉండడంతోనే సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. ఇదిలా ఉండగా.. తాజాగా ఈనెల 24న సినిమా రాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. దీనిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది..