E-Paper
Advertisement

Balakrishna: నా దగ్గరకొస్తే తంతా.. నిర్మాతలపై బాలయ్య తీవ్ర ఆగ్రహం

Balakrishna: నా దగ్గరకొస్తే తంతా.. నిర్మాతలపై బాలయ్య తీవ్ర ఆగ్రహం
Advertisement

Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna)50 సంవత్సరాల సినీ కెరియర్ లోనే అఖండ 2 సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఈ సినిమా బాలకృష్ణ సినీ కెరియర్ లో 110 సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2(Akhanda 2) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు కాబోతుందని చిత్ర బృందం ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో బాలకృష్ణ వరుసన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా..

బాలకృష్ణ సినీ కెరియర్ లోనే మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ముంబైలో కూడా బాలకృష్ణ పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహించారు. ఈ సినిమా విడుదలకు అన్ని సిద్ధం అనుకున్న తరుణంలో నిర్మాతలు ఊహించని విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ అధికారికంగా వెల్లడించారు. ఇలా సినిమా వాయిదా పడటం వెనుక ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా అనుకున్న విధంగా డిసెంబర్ 5వ తేదీ విడుదల కావాలి అంటే ముగ్గురు ఫైనాన్షియర్లకు 70 కోట్ల రూపాయలు నిర్మాతలు చెల్లించాల్సి ఉంటుంది.

నిర్మాతలకు చివాట్లు పెట్టిన బాలయ్య..

Advertisement

ఇలా ఫైనాన్షియర్లకు డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదలకు ఒప్పుకొని నేపథ్యంలో వాయిదా వేయక తప్పలేదు అయితే ఈ విషయం ఇన్ని రోజులు బాలకృష్ణ వద్ద దాచి ఉంచారని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఈ విషయాన్ని బాలయ్య దగ్గరకు వెళ్లి చెప్పడంతో బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాకుండా నిర్మాతలకు కూడా చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ ఫైనాన్స్ విషయం తన దగ్గర దాచి పెట్టి ఇప్పుడు తన దగ్గరకు ఈ సమస్యను ప్రస్తావించడానికి వస్తే తంతా అంటూ బాలయ్య నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో నిర్మాతల కారణంగా సినిమా విడుదల వాయిదా పడిన నేపథ్యంలో బాలకృష్ణ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. బాలకృష్ణకు అఖండ 2 సినిమా ఎంతో కీలకంగా నిలిచింది మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో స్టార్ హీరో అయినప్పటికీ ప్రమోషన్లకు దూరంగా ఉండకుండా స్వయంగా చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా సినిమాకు అంతా సిద్ధమైందనుకున్న నేపథ్యంలో నిర్మాతలు ఈ సినిమా విడుదలకు గల సమస్యను వివరించిన నేపథ్యంలో బాలకృష్ణ నిర్మాతల తీరుపై మండిపడుతున్నారు. మరి నిర్మాతలు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించి త్వరలోనే విడుదల సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ క్రిస్మస్ కి విడుదల అయితే క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పాలి.

Also Read: Akhanda 2: అఖండ 2కు 70 కోట్ల ఫైనాన్స్ ఇష్యూ.. ఎవరికి ఎంత ఇవ్వాలంటే..?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×