E-Paper
Advertisement

Balakrishna: సూపర్ స్టార్ ను అనుకరించి నవ్వుల పాలైన బాలయ్య.. వీడియో వైరల్!

Balakrishna: సూపర్ స్టార్ ను అనుకరించి నవ్వుల పాలైన బాలయ్య.. వీడియో వైరల్!
Advertisement

Balakrishna:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు ఏడు పదుల వయసుకు చేరువలో కూడా వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బాలయ్య.. మరొకవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సాధారణంగా బాలయ్య బయటకి వస్తే మాత్రం అభిమానులపై చేయి కూడా చేసుకుంటూ ఉంటారు.. అంతేకాదు చాలా సార్లు వేదికలపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు బాలయ్య. అలాంటి ఈయన తాజాగా సినిమాల్లో లాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) ను అనుకరిస్తూ నవ్వుల పాలయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టంట్స్ చేసి నవ్వుల పాలైన బాలయ్య..

విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ లో అద్దాలను గాల్లోకి ఎగరేశారు బాలయ్య. అయితే అది వర్క్ అవుట్ కాక కింద పడిపోవడంతో వెంటనే తీసుకొని జేబులో వేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మనకెందుకు ఇలాంటి అనుకరణలు బాలయ్య అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది పాపం బాలయ్య స్టంట్ చేసి నవ్వుల పాలయ్యాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండడం గమనార్హం.

బాలయ్య ప్రస్తుత సినిమాలు..

Advertisement

బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలకృష్ణ నుండి రాబోయే చిత్రాల విషయానికొస్తే NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. భారీ విఎఫ్ఎక్స్ తో హై యాక్షన్ వోల్టేజ్ తో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఇకపోతే మార్చి 2026 నుండి ఈ సినిమా షూటింగు ప్రారంభం కానుండగా.. 2027లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఈ సినిమాకి వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

ప్రేక్షకుల మనసే కాదు ప్రజల మనసు దోచుకున్న బాలయ్య..

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బాబి కొల్లి తో ఒక ప్రాజెక్టు చేయనున్నారు. మరోవైపు బాలయ్య కెరియర్ లోనే సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలిచిన ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 పేరుతో తెరపైకి రానుంది. మొత్తానికైతే ఈ వయసులో కూడా బాలయ్య వరుస సినిమాలు ప్రకటిస్తూ తన ఎనర్జిటిక్ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరించి.. తనలోని టాలెంట్ ను అందరికీ చూపించారు బాలయ్య. అంతేకాదు హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా మూడుసార్లు గెలుపొంది అటు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×