E-Paper
Advertisement

Honda Activa e vs Suzuki Access 125: హోండా యాక్టివా ఇ vs సుజుకి యాక్సెస్ 125, వీటిలో ఏది బెస్ట్ అంటే?

Honda Activa e vs Suzuki Access 125: హోండా యాక్టివా ఇ vs సుజుకి యాక్సెస్ 125, వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Honda Activa e vs Suzuki Access 125: హోండా యాక్టివా ఇ (ఎలక్ట్రిక్), సుజుకి యాక్సెస్ 125 (ICE) ప్రస్తుతం ఇండియన్ టూవీలర్ మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రెండు ఇంచుమించు ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. యాక్టివా ఇ ఒకే ఛార్జ్ మీద 102 కి.మీ ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. గంటకు 80 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఆధునిక ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.1.18 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. యాక్సెస్ 125 అనేది 124cc పెట్రోల్ స్కూటర్. ఇది లీటర్ పెట్రోల్ మీద సుమారు 45 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 90,000 నుంచి ప్రారంభం అవుతుంది.

హోండా యాక్టివా ఇ,  సుజుకి యాక్సెస్ 125 మధ్య పోలికలు

 

⦿ పనితీరు & పవర్‌ట్రెయిన్

Advertisement

యాక్టివా ఇ ఒకే ఛార్జ్ మీద 102 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. రెండు రిమూవబుల్ 1.5 kWh బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఇది 22 Nm టార్క్‌ తో 6 kW మోటారును అందిస్తుంది. ఇది గంటకు 80 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.  యాక్సెస్ 125..  124cc ఇంజిన్‌ తో వస్తుంది. 8.7 PS పవర్, 10 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ 90 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంది.

Read Also:ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ మరింత పెరగాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

⦿ ధర

Advertisement

యాక్టివా ఇ చాలా ఖరీదైనది. ధర రూ.1.18 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.  సుజుకి ధర సుమారు రూ. 90,000 నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ ఫీచర్లు

యాక్టివా ఇ..  ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ లాంటి రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. యాక్సెస్ 125 టాప్ ట్రిమ్‌ లలో బ్లూ టూత్ (రైడ్ కనెక్ట్), LED లైట్లు, డిజిటల్ కన్సోల్‌ తో సహా హై ఎండ్ ఫీచర్లను అందిస్తుంది.

Read Also: ఫిబ్రవరిలో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చూస్తే మతిపోతోంది బ్రో!

ఏ స్కూటర్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?  

రెండు స్కూటర్లు ప్రస్తుతం మార్కెట్ లో టాప్ మోడల్స్ గా కొనసాగుతున్నాయి. అయితే, తక్కువ మెయింటెనెన్స్  ఖర్చులు, స్మార్ట్ ఫీచర్లు, ఆధునిక, నిశ్శబ్ద, ఉద్గార రహిత, జిప్పీ సిటీ ప్రయాణాల కోసం యాక్టివా ఇ ని ఎంచుకోవడం మంచిది. మంచి మైలేజ్, చక్కటి ప్రయాణ అనుభూతి, అప్పుడప్పుడు హైవే వినియోగానికి సూటయ్యే వేగం, తక్కువ ఖర్చు లో స్కూటర్ కావాలి అనుకునే వారికి సుజుకి యాక్సెస్ 125 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: మారుతి To స్కోడా.. ఫిబ్రవరి 2026లో విడుదల కాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×