E-Paper
Advertisement

NBK 111: నుండీ నయనతార అందుకే తప్పుకుందా.. ఈ వ్యత్యాసం ఎందుకు? బాలయ్య ఫ్యాన్స్ ఫైర్!

NBK 111: నుండీ నయనతార అందుకే తప్పుకుందా.. ఈ వ్యత్యాసం ఎందుకు? బాలయ్య ఫ్యాన్స్ ఫైర్!
Advertisement

NBK 111:సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara) ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. తెలుగు, తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా సీనియర్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోల వరకు ఎంతోమందితో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

బాలయ్య మూవీ నుండి తప్పుకున్న నయనతార.. రంగంలోకి కాజల్..

ఈ సినిమా అందించిన సక్సెస్ తో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది నయనతార. అందులో భాగంగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న NBK 111 సినిమాలో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సింహ , శ్రీరామరాజ్యం, జై సింహా అంటూ మూడు సినిమాలు రాగా.. మూడు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో నాలుగవసారి ఈ కాంబినేషన్లో సినిమా అనేసరికి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ ఆ సక్సెస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని సంబరపడ్డారు. కానీ అంతలోనే నయనతార ఈ సినిమా నుండి తప్పుకోగా.. కాజల్ అగర్వాల్ ని దింపేశారు.

నయనతార అందుకే సినిమా నుండి తప్పుకుందా?

Advertisement

కాజల్ అగర్వాల్ ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే వెండితెరపై బాలకృష్ణ కాజల్ సందడి చేసి ఆకట్టుకున్నారు. అందులో భాగంగానే కాజల్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిందని.. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అంటూ అభిమానులు కామెంట్లు చేశారు. ఇక అంతా బాగానే ఉన్నా సడన్ గా నయనతార ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది ?అనే వార్తలు నెటిజన్స్ నుంచి వ్యక్తమయ్యాయి. దీనికి కారణం రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. బాలయ్య – గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం నయనతార ఏకంగా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. ఇక భారీ పారితోషకం డిమాండ్ చేయడం , షూటింగ్ కాల్ షీట్ల సర్దుబాటు, ప్రమోషన్లకు దూరంగా ఉండే నిబంధనల వల్లే మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.

ALSO READ:వీల్ చైర్ కే పరిమితమైన స్టార్ డైరెక్టర్.. నడవలేని పరిస్థితుల్లో!

నయనతారపై మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్!

Advertisement

ఇకపోతే నయనతార ఈ సినిమా నుండి తప్పుకోవడంతో నెటిజన్స్ , బాలయ్య అభిమానులు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వ్యత్యాసం ఎందుకు అంటూ మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమాలో శశిరేఖ పాత్రలో నయనతార అద్భుతమైన నటన కనబరిచింది. అయితే ఈ పాత్ర కోసం కేవలం రూ.6 కోట్లు మాత్రమే తీసుకుంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో సందడి చేసింది. చిరంజీవి సినిమాకు తన కట్టుబాట్లు అన్నీ పక్కన పెట్టి రెమ్యూనరేషన్ తగ్గించుకొని మరీ ఈ సినిమా చేసింది. అయితే చిరంజీవి తోటి నటుడు బాలయ్య.. ఇద్దరికీ కూడా స్టార్ స్టేటస్ ఉంది. అలాంటిది చిరంజీవి కోసం తగ్గిన నయనతార.. బాలకృష్ణ విషయంలో ఎందుకు డిమాండ్ చేస్తోంది అనే కామెంట్లు ఇప్పుడు నెట్టింట గుప్పుమంటున్నాయి. మరి ఈ విషయం ఎంతకు దారి తీస్తుందో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×