E-Paper
Advertisement

వీల్ చైర్ కే పరిమితమైన స్టార్ డైరెక్టర్.. నడవలేని పరిస్థితుల్లో!

వీల్ చైర్ కే పరిమితమైన స్టార్ డైరెక్టర్.. నడవలేని పరిస్థితుల్లో!
Advertisement

Bharathi Raja:ఒకప్పుడు సినిమాలలో నటించి లేదా సినిమాలకు దర్శకత్వం వహించి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఎంతో మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమవుతూ.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ భారతీరాజా(Bharathi Raja) కూడా ఒకరు. తన అద్భుతమైన దర్శకత్వ మెళుకువలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి.. నేడు ఆయన కదలలేని పరిస్థితిలో కుర్చీకే పరిమితం అవడం చూసి అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. మరి భారతీరాజా ఆరోగ్య పరిస్థితి ఇలా దిగజారడానికి అసలు కారణం ఏమిటి? ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలు ఒకసారి చూద్దాం..

ఎంతోమంది హీరోల పాలిట దేవుడు.. ఇప్పుడు నడవలేని స్థితిలో దర్శకుడు..

1941 జూలై 17న తమిళనాడులో జన్మించిన భారతీ రాజా అసలు పేరు చిన్నస్వామి. థియేటర్ నేపథ్యంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన.. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ను ప్రారంభించారు. 1977లో విడుదలైన ’16 వైయతినిలే’ అని చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా తమిళ సినిమాకు కొత్త యుగాన్ని అందించింది. ముఖ్యంగా కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల కెరీర్ కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ముఖ్యంగా భాగ్యరాజు, రేవతి, రాధిక వంటి పలువురు నటులు ఈయన సినిమాల ద్వారానే మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఎన్నో సినిమాలు ఇండస్ట్రీకి మంచి విజయాన్ని అందించాయి. నటుడిగా కూడా సత్తా చాటారు. తండ్రిగా, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. వయసు పెరిగినా ఆయన నటనలోని సహజత్వం మాత్రం ఎక్కడా తగ్గలేదు.

క్షీణించిన డైరెక్టర్ ఆరోగ్యం..

Advertisement

ఇక తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. జీవితకాల సౌఫల్య పురస్కారంతోపాటు తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఎన్నో గౌరవాలు ఆయన సేవలకు నిదర్శనం. ఇదిలా ఉండగా కొన్నాళ్ల క్రితం భారతి రాజా ఏకైక కుమారుడు, దర్శకుడు , నటుడు అయిన మనోజ్ భారతీరాజా ఆకస్మిక మరణం ఆయనను ఆ బాధ నుండి బయట పడేయలేకపోయింది. కొన్నాళ్లు మలేషియాలోని కుమార్తె దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైకి తిరిగి వచ్చారు . కానీ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఇంట్లోనే వీల్ చైర్ లో విశ్రాంతి తీసుకుంటూ నడవలేని స్థితిలో ఉన్న భారతి రాజాను చూసి అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు.

భారతీరాజాను పరామర్శించిన రాధిక శరత్ కుమార్..

ఇటీవల భారతీరాజాను ప్రముఖ సినీనటి రాధికా శరత్ కుమార్ కూడా కలిసారు ఆయన యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను రాధిక తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకోగా అసలు విషయం బయటకు వచ్చి అందరూ ఆశ్చర్యపోతున్నారు. భారతి రాజా త్వరగా కోలుకోవాలని మునుపటి వైభవాన్ని తిరిగి అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం భారతి రాజా పరిస్థితి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement

ALSO READ:తల్లి కాబోతున్న కేరింత హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!

నేషనల్ అవార్డు వస్తుందంటూ డైరెక్టర్ ఆశీర్వాదం..

రాధిక శరత్ కుమార్ భారతీ రాజాతో మాట్లాడుతూ.. నేను ఇటీవల నటించిన తాయ్ కెళవి సినిమా చూశారా? చాలా బాగుంది అని చెప్పగా.. ఆయన మాట్లాడుతూ..” చాలా బాగుంది .నీకు నేషనల్ అవార్డు వస్తుంది” అంటూ తెలిపారు. ఇక మీరు చెప్పిన మాటలు నిజం అవ్వాలి..అలాగే మీరు మళ్ళీ ఎప్పటిలాగే నడవాలి అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×