E-Paper
Advertisement

Honey Rose : హనీ రోజ్ రీఎంట్రీ.. మరో ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో..!

Honey Rose : హనీ రోజ్ రీఎంట్రీ.. మరో ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో..!
Advertisement

Honey Rose: మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఈమధ్య పెద్దగా సినిమాలలో కనిపించలేదు.. బాలయ్య తో చేసిన ఆ సినిమా తప్ప మరో సినిమాలో ఆమె నటించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఈమె వరుసగా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తూ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది.. అయితే ఇప్పుడు మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఆమె మరో సినిమాలో నటించబోతుంది అంటే ఫ్యాన్సు ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇంతకీ ఏ హీరో సినిమాలో ఆమె నటించబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

బాలయ్యతో మరోసారి జోడీ..

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గతంలో నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది హనీ రోజ్.. ఈ మూవీలో బాలయ్యకు జోడిగా నటించింది.. ఆ సినిమా వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఆమె తర్వాత సినిమాని ప్రకటించలేదు.. ఇప్పుడు మరోసారి బాలయ్య తోనే జోడి కట్టబోతుంది అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ , యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు పెరకేకుతున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్గా హాని రోజ్ ను తీసుకొనున్నట్లు సమాచారం. బాలయ్య హనీ రోజ్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చింది.. ముఖ్యంగా ‘సుగుణ సుందరి’ పాటలో వీరిద్దరి డ్యాన్స్ మూమెంట్స్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఆ సినిమా ఇప్పుడు ఎలాగైతే మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో ఇప్పుడు కూడా అలాగే రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని దర్శకుడు గట్టిగా నమ్ముతున్నాడు. అతి త్వరలోనే ఈ కాంబో గురించి అధికారిక ప్రకటన రాబోతుంది.

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ సీరియల్ నుంచి శైలజ అవుట్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..?

NBK111 షూటింగ్ అప్డేట్..

నందమూరి బాలయ్య నటించిన అఖండ మూవీకి సీక్వల్ గా వచ్చిన అఖండ 2 ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.. దాంతో ఈసారి ఎలాగైనా సరే భారీ విషయాన్ని కొట్టాలి అని బాలయ్య ఫిక్స్ అయ్యాడు.. ఈ క్రమంలో భారీ యాక్షన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఈయన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఒక భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.. ఈ మూవీలో బాలయ్య దేశాన్ని వణికించే మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈయనకు జోడిగా హాట్ బ్యూటీ డింపుల్ హయాతి నటిస్తుంది. అతి త్వరలోనే ఈ టీంలోకి హనీ రోజ్ కూడా జాయిన్ అవుతుంది.. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.. ఈ మూవీ తర్వాత బాలయ్య మరో యాక్షన్ మూవీకి సైన్ చేసినట్టు తెలుస్తుంది.

Related News

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

Big Stories

Advertisement
×