E-Paper
Advertisement

బాలయ్య లెక్క తప్పదు.. స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్..?

బాలయ్య లెక్క తప్పదు.. స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్..?
Advertisement

Balayya : నందమూరి నరసింహ బాలయ్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ ఉన్న హీరోలలో ఈయన ఒకడు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచిన కూడా.. కొత్త సినిమాలకి కొదవ లేకుండా వరుస సినిమాలనే లైన్ లో పెట్టుకుంటున్నాడు బాలయ్య.. అయితే మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగానే బాలయ్య సినిమాలో ఉండడంతో అభిమానులు ఎక్కువగా వాటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నిజానికి బాలయ్యకు ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఏ సినిమాలను చేస్తూ బిజీగా ఉంటాడు. ఇదిలా ఉండగా ఓ స్టార్ హీరో సినిమాలో బాలయ్య కి ఛాన్స్ వచ్చిందని దానికి నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమాకు సీక్వెల్ కి రాబోతున్న సినిమాలో బాలయ్య చేస్తాడా అన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ చర్చగా మారాయి. మరి దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

జైలర్ 3 లో బాలయ్య..?

తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన జైలర్ 2 సినిమా కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియానే అనే కొనసాగుతుంది.. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా మూడవ పార్ట్ కూడా రాబోతుంది అని సినిమా ఎండింగ్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన రెండు పార్టీలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ఇప్పుడు మూడో భాగం కోసం కూడా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా బాలయ్యని సంప్రదించారట అయితే దానికి బాలయ్య నో చెప్పడంతో కనీసం ‘జైలర్ 3’ లో అయిన నటిస్తారా అన్న చర్చ నడుస్తుంది. నిజానికి బాలయ్య తన మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఒక లెక్క ప్రకారం సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఆయన గెస్ట్ రోల్ లో కనిపించిన సినిమాలు లేవని తెలుస్తుంది. మరి ఈసారి తన అభిప్రాయాన్ని మార్చుకుంటారా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

బాలయ్య సినిమాల విషయానికొస్తే..

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి నట సింహం బాలయ్య. తన పవర్ ఫుల్ డైలాగ్ లతో యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల్లో అలా ఉండిపోతాడు. బాలయ్య ఈ ఏడాది నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే టాక్ ను అందుకున్నాయి. గత కొద్దిరోజులుగా బాలయ్య కొత్త సినిమాల వేట మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని కాంబినేషన్లో దాదా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకొచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.. ఆ సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ ప్రాజెక్టుల గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.

Also Read :త్రివిక్రమ్ ఆ తప్పు ఎందుకు చేశాడు..? వెంకీ ఫ్యాన్స్ హర్ట్..!

Related News

‘రామాయణ’ మూవీ రన్ టైం.. డైరెక్టర్ ప్లాన్ ఇదేనా..?

త్రివిక్రమ్ ఆ తప్పు ఎందుకు చేశాడు..? వెంకీ ఫ్యాన్స్ హర్ట్..!

ప్రభాస్ చేతిలో గన్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

ప్రేమ, పెళ్లి గురించి వెంకీ మామ కామెడీ.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు!

ప్రభాస్ సలార్ 2 షూటింగ్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్ వచ్చేసింది.. కథలో ఏదో కొత్తగా ఉందే!

రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

Big Stories

Advertisement
×