E-Paper
Advertisement

Band Melam: బావామరదళ్ల ‘బ్యాండ్‌ మేళం’.. థియేటర్లలో మోత మోగిస్తుందా?

Band Melam: బావామరదళ్ల ‘బ్యాండ్‌ మేళం’.. థియేటర్లలో మోత మోగిస్తుందా?
Advertisement

Band Melam: ‘కోర్టు’ సినిమాతో ప్రామిసింగ్ జోడీగా పేరు తెచ్చుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా నటించిన క్యూట్ అండ్ ఎమోషనల్ విలేజ్ లవ్ స్టోరీ ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో యూత్‌లో భారీ అంచనాలను పెంచేసింది.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్!
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్య ప్రేమకథ అని అర్థమవుతోంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బావ గిరి (హర్ష్ రోషన్), మరదలు రాజి (శ్రీదేవి)ల మధ్య గిల్లికజ్జాలు, అల్లరి, ఆపై విడిపోవడానికి దారితీసిన ఎమోషనల్ మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

Advertisement

 ముఖ్యంగా “నువ్వు వచ్చిన తర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకుపెట్టుకున్నా.. నువ్వు మళ్ళీ పగలగొట్టినవ్‌..” అంటూ హీరో చెప్పే డైలాగులు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ మ్యాజిక్!
ఇక  ‘బేబి’ వంటి సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ తర్వాత విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. ట్రైలర్‌లో వినిపిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మెలోడీ సాంగ్స్ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. సీనియర్ నటుడు సాయి కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటం సినిమా వెయిటేజీని మరింత పెంచింది.

Advertisement

విడుదల తేదీ ఫిక్స్: నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సి ఉంది. కానీ, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజ్ దృష్ట్యా, పోటీని నివారించేందుకు మేకర్స్ తెలివిగా రెండు వారాలు వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయి, మార్చి 26న శ్రీరామనవమి కానుకగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

రామానాయుడు స్టూడియోలో స్పెషల్ ప్రివ్యూ!
లేటెస్ట్ సమాచారం ప్రకారం, చిత్ర బృందం రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రివ్యూను వీక్షించినట్లు తెలుస్తోంది. సినిమా అవుట్‌పుట్ పట్ల మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కోన వెంకట్ సమర్పణలో, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన ఈ ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సౌండ్ చేస్తుందో తెలియాలంటే మార్చి 26 వరకు ఆగాల్సిందే!

సినిమా వివరాలు:

నటీనటులు: హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు.

దర్శకత్వం: సతీష్ జవ్వాజి

సంగీతం: విజయ్ బుల్గానిన్

సమర్పణ: కోన వెంకట్

రిలీజ్ డేట్: మార్చి 26, 2026

also read: Biker Trailer: ఒకరిది డ్రీమ్..ఒకరిది కెరీర్ ఆసక్తికరంగా శర్వా బైకర్ ట్రైలర్..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×