E-Paper
Advertisement

Iran War: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వర్సెస్ డర్టీ బాంబ్.. భూగర్భ అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విధ్వంసం

Iran War: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వర్సెస్ డర్టీ బాంబ్.. భూగర్భ అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విధ్వంసం
Advertisement

Iran War: రెండు, మూడు రోజుల్లో ముగుస్తుందనుకొని ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించాయి అమెరికా, ఇజ్రాయెల్. అనుకున్నట్టుగానే తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా.. అనేక టాప్ కమాండర్‌లను మట్టుపెట్టేసింది. కానీ ఆశ్చర్యకరంగా ఇరాన్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అమెరికాకు లొంగలేదు. ఇప్పుడు యుద్ధం నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇంకా ఎక్కడా తగ్గకుండా పోరాడుతూనే ఉంది. రోజుకో కొత్త రకం ఆయుధాన్ని తన అమ్ములపొదిలో నుంచి బయటికి తీసి శత్రువుపై ప్రయోగిస్తూ పరేషాన్ చేస్తోంది. ఇప్పుడు ఇదే అమ్ములపొదిలో నుంచి డర్టీ బాంబ్‌ను కూడా తీసి ప్రయోగిస్తుందా? అనే భయం ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్‌లో మొదలైనట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం ప్రారంభంకాగానే వందలాది మిసైళ్లతో ఇజ్రాయెల్ సహా అన్ని గల్ఫ్ దేశాలపై విరుచుకపడింది ఇరాన్. ఆ తర్వాత తక్కువ ఖర్చుతో తయారైన షహీద్ డ్రోన్లను ప్రయోగిస్తూ శత్రు దేశాలకు ఖర్చును తడిసిమోపడయ్యేలా చేసింది. ఇంకా చేస్తుంది కూడా. ఆ తర్వాత కొన్ని హైపర్ సోనిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది.

ఆ షాక్ పేరే డర్టీ బాంబ్‌..

ఈ దెబ్బకు అమెరికా బిలియన్ డాలర్ల విలువైన రాడార్‌లను కోల్పోయింది. యాంటి మిసైల్ డిఫెన్స్‌ వ్యవస్థలను కూడా కోల్పోయింది. ఇదే సమయంలో క్లస్టర్‌ బాంబులను ప్రయోగించింది. ఒకే మిసైల్‌గా దూసుకెళ్లే ఈ బాంబులు.. శత్రు దేశాల లక్ష్యాలకు చేరువకాగానే.. అనేక బాంబులుగా విడిపోయి.. యాంటి మిసైల్ సిస్టమ్స్‌కు దొరక్కుండా అనేక లక్ష్యాలను నాశనం చేశాయి. ఇప్పుడు తన శత్రు దేశాలకు మరో కొత్త బాంబ్‌తో ఇరాన్ షాక్ ఇవ్వబోతుందా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ షాక్ పేరే డర్టీ బాంబ్‌. ఇదే ఇరాన్‌ అమ్ములపొదిలో ఉన్న చివరి అస్త్రం అనే చర్చ జరుగుతోంది. అమెరికా మిడిల్ ఈస్ట్ అంబాసిడర్‌ స్టీవ్ విట్కాఫ్ కొన్ని రోజుల క్రితం ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇరాన్‌ వద్ద 60 శాతం స్వచ్ఛత కలిగిన 460 కిలోల యురేనియం సిద్ధంగా ఉంది.. దీనిని కొన్ని రోజుల్లోనే ఒక ఆయుధంగా మార్చే అవకాశం ఉంది. ఈ యూరేనియంతో 11 అణుబాంబులు తయారు చేయవచ్చు లేదా లేక్క లేనన్ని డర్టీ బాంబులను తయారు చేయవచ్చు అనేది ఆయన స్పీచ్ సారాంశం.

Advertisement

Also Read: AP Weather: అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. పిడుగులు, ఈదురు గాలులతో జాగ్రత్త!

వార్నింగ్ బెల్..

ఎప్పుడైతే విట్కాఫ్‌ నోటి నుంచి డర్టీ బాంబు పేరు వినిపించిందో ఇక ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. నిజానికి అణుబాంబు, డర్టీ బాంబుకు చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్‌ అణుబాంబు ప్రయోగిస్తే.. ఒక నగరం మొత్తం నాశనమవుతుంది.. నామరూపాల్లేకుండా పోతుంది. కానీ డర్టీ బాంబు అలా కాదు. ఈ బాంబు నాశనం చేయదు. కానీ ఆ నగరం మాత్రం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే డర్టీ బాంబులో రేడియోయాక్టివ్ వ్యర్థాలతో పాటు పేలుడు పదార్థాలు ఉంటాయి.

రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైస్..

Advertisement

డర్టీ బాంబులో రెండు పార్ట్స్‌ ఉంటాయి. డైనమైట్ లేదా RDX లాంటి పేలుడు పదార్థాలు ఉంటాయి.. ఇక రెండోది కోబాల్డ్ 60, సీసీయం 137 లేదా అణు విద్యుత్‌ కేంద్రాల నుంచి వచ్చే రేడియోధార్మిక వ్యర్థాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి డర్టీ బాంబులను తయారు చేస్తారు. వీటిని RDD అంటే రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైస్ అని పిలుస్తారు. అంటే న్యూక్లియర్ బాంబులలో జరిగినట్టు న్యూక్లియర్ ఫిజన్ జరగదు. కానీ బాంబు పేలినప్పుడు పేలుడు పదార్థాల వల్ల అందులో ఉన్న రేడియోధార్మిక పొడి లేదా రేణువులు గాలిలోకి, నీటిలోని, ఇతర ప్రాంతాల్లోకి వెళతాయి. ఒక్కసారి రేడియోధార్మిక ఆ ప్రాంతంలో చేరింది అంటే.. ఆ నెల ఇక ఎందుకు పనికిరాదు. రేడియోషన్ విస్తరించడంతో అక్కడ ఉండే ప్రజలకు క్యాన్సర్ రావడం, గర్భిణీలకు పుట్టబోయే పిల్లల్లో లోపాలు ఉండటం కామన్‌గా మారతాయి. ఆ ప్రాంత ప్రజలు ఖాళీ చేయడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. దీనిని క్లీన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కొన్ని వేల కోట్లు కుమ్మరించాల్సి ఉంటుంది.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ..

సో మరణాలు తక్కువగా ఉంటాయి.. కానీ మరణిస్తేనే మంచిది అనే పరిస్థితులు క్రియేట్ చేస్తుంది డర్టీ బాంబు. అందుకే ఇరాన్ ఇప్పుడు ఇలాంటి బాంబులను తయారు చేసి ప్రయోగిస్తుందనే భయం అమెరికా, ఇజ్రాయెల్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే లక్ష్యమని ప్రకటిస్తూ.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే అనేక అణు కేంద్రాలపై దాడులు చేస్తూ వస్తున్నాయి. కానీ భూమికి చాలా లోపల ఈ కేంద్రాలు ఉండటంతో.. అవి అనుకున్నంత దెబ్బతిన్నట్టు కనిపించడం లేదు. అందుకే అమెరికా నుంచి ఇప్పుడిలాంటి ప్రకటనలు రావడం మొదలైంది. మరి ఇలాంటి బాంబ్‌ను ఇరాన్‌ను నిజంగా తయారు చేస్తే మొదట ఏ దేశంపై ప్రయోగిస్తుంది? దీనిని అడ్డుకునే పరిస్థితి ఉంటుందా? అసలు అమెరికా ప్రకటించే అంశాల్లో నిజమెంత?

Also read: Galaxy S26 Discount: శాంసంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ.8000 డిస్కౌంట్.. వారికి మాత్రమే లిమిటెడ్ ఆఫర్

ఇరాన్ అగ్ర నాయకత్వం

ఇరాన్‌ కనుక నిజంగా డర్టీ బాంబ్‌ను తయారు చేసి ఉండి.. ప్రయోగించాలనుకుంటే దానికి మొదట కనిపించే దేశం… ఇజ్రాయెల్. యస్.. ఇజ్రాయెల్‌పై తప్ప మరే దేశంపై ఇరాన్‌ ఈ డర్టీ బాంబ్‌ను ప్రయోగించే అవకాశమే లేదు. ఎందుకంటే ఇరాన్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి.. ఈ యుద్ధం ప్రారంభమవడానికి.. ఇరాన్ అగ్ర నాయకత్వం తుడిచి పెట్టుకుపోవడానికి కారణం ఇజ్రాయెల్. అందుకే ఈ బాంబును ప్రయోగించాల్సి వస్తే దానికి మొదట కనిపించే దేశం ఇజ్రాయెల్ మాత్రమే. గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ డర్టీ బాంబ్‌ను ప్రయోగించే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలపై చేసిన బాలిస్టిక్ క్షిపణుల దాడికి కూడా క్షమాపణలు కోరుతోంది. అమెరికాకు ఆశ్రయం ఇస్తున్నారని తప్ప.. ఆ దేశాలపై తమకు వేరే కోపం లేదని చెబుతోంది ఇరాన్. ఇప్పటికైనా అమెరికా, ఇజ్రాయెల్‌కు దూరంగా జరగాలని కోరుతోంది ఇరాన్. సో.. గల్ఫ్ దేశాలపై ఇరాన్‌కు అమెరికా ప్రచారం చేస్తున్నంత కోపమైతే లేదు. కానీ తప్పక దాడులు చేస్తున్నదని అర్థమవుతుంది.

సక్సెస్ అయ్యిందంటూ ప్రచారం

అసలు ఇరాన్ నిజంగా డర్టీ బాంబులను తయారు చేసిందా? అనేది అసలైన ప్రశ్న. ఎందుకంటే ఇరాన్‌ ఏ దేశంపైన అయినా దాడులు చేయాలనుకున్నా.. ఒకవేళ చేసిన తర్వాత సమర్థించుకోవడానికైనా అనేక కారణాలు చెబుతుంటుంది. చరిత్ర ఇది నిజమని చెబుతోంది. రసాయన ఆయుధాలు తయారు చేశారని సద్ధాం హుస్సేన్‌ను మట్టుపెట్టేసింది. ఇలా గల్ఫ్ దేశాల్లో ఒక్కో దేశంపై ఒక్కో కారణంతో దాడులు చేస్తూ వచ్చింది అమెరికా. మొన్నటి వరకు ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేయడంలో సక్సెస్ అయ్యిందంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత దాడులు జరుగుతున్న సమయంలో ఇరాన్ అణు స్థావరాలను దెబ్బతీశామని ప్రకటించారు. ఇప్పుడు డర్టీ బాంబులు అంటూ మరో ప్రకటన రిలీజ్ చేశారు. కారణం ఏదైనా ఇరాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి నిజంగా ఇరాన్‌ డర్టీ బాంబులను తయారు చేసిందా? అంటే ఔనని ధ్రువీకరించడం లేదు అమెరికా, ఇజ్రాయెల్. కావొచ్చు.. చేయవచ్చు.. అని చెబుతున్నాయి. ఇదే కారణం చూపి దాడులు చేస్తున్నాయి. మరి ఇరాన్ వద్ద నిజంగా 60 శాతం శుద్ధి చేసిన యురేనియం ఉందా? అంటే దానికి సరైన సమాధానం లేదు. కానీ అంతర్జాతీయ నివేదికలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలు మాత్రం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం ఉందని బల్లగుద్దీ మరీ వాదిస్తున్నాయి. నిజానికి అణుబాంబును తయారు చేయాలంటే 90 శాతం శుద్ధి చేసిన యురేనియం కావాలి. టెక్నికల్‌గా చూస్తే ఇరాన్‌ అణుబాంబు తయారీకి చాలా చెరువలో ఉన్నట్టే అని చెప్పాలి.

Also Read: Vahan Portal: వాహనాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో నేటి నుండి వాహన్ పోర్టల్ ప్రారంభం

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×