BigTV English

Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!

Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!
Advertisement

Bandla Ganesh: బండ్ల గణేష్(Bandla Ganesh) టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం నిర్మాతగా ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో బండ గణేష్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి వరుస సక్సెస్ అందుకున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ సినిమాలలో నటించడం లేదు, అలాగే నిర్మాతగా సినిమాలను కూడా చేయటం లేదు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీ గురించి సెలబ్రిటీల గురించి తరచూ ఈయన మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.


స్పెషల్ అట్రాక్షన్ గా చిరంజీవి..

దీపావళి(Diwali) పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ కన్ను మొత్తం బండ్ల గణేష్ పైనే ఉంటుంది ప్రతి ఏడాది దీపావళి పండుగను బండ్ల గణేష్ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా బండ్ల గణేష్ ఎంతో ఘనంగా దీవాలి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

చిరంజీవి కోసం ప్రత్యేకంగా సింహాసనం..

బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా అతిథి మర్యాదలను నిర్వహించారు. ముఖ్యంగా చిరంజీవి గారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కుర్చీ (Chair)ప్రస్తుతం సంచలనగా మారింది. తాజాగా ఈ కుర్చీకి సంబంధించిన ఫోటోని బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.”మా బాస్ చిరంజీవి గారు ఇంటికి వస్తున్నారని ఆప్యాయంగా ఆ సింహాసనం తయారు చేయించుకున్నాను. ఆ స్థానంలో ఆయన కూర్చున్న ఆ క్షణం నా మనసు ఉప్పొంగిపోయింది” అంటూ బండ్ల గణేష్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.


https://twitter.com/ganeshbandla/status/1979818149106131409?t=rRV71URtYJtKHPVWnP4PGw&s=08

ఇక ఈ వేడుకలో బండ్ల గణేష్ చిరంజీవి గారి పట్ల ఎంతో అభిమానాన్ని చాటుకున్నారు. స్వయంగా బండ్ల గణేష్ వెళ్లి చిరంజీవికి స్వాగతం పలకడం, చిరంజీవి గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలను కూడా తీసుకున్నారు. మొదటినుంచి కూడా మెగా కుటుంబం అంటే బండ్ల గణేష్ కు ఎంతో అభిమానం అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ ప్రాణాలైనా ఇస్తారు. ఏకంగా ఆయనని దేవుడిగా భావించి పూజిస్తూ ఉంటారు. ఇలా మెగా కుటుంబం పట్ల బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సింహాసనం మీద కూర్చునే అర్హత ఎక్కడైనా ఆ ఇంద్రసేనుడిదే అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?

Related News

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?

Big Stories

×