BigTV English

Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?

Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?
Advertisement

Raviteja: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రవితేజ (Raviteja) ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనంతరం చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రవితేజకు హీరోగా అవకాశం వచ్చింది. ఇలా హీరోగా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.


మాస్ మహారాజ్ బిరుదు వెనుక డైరెక్టర్..

రవితేజ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈయన నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ,శ్రీ లీల(Sreeleela) జంటగా నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నటుడు రవితేజ డైరెక్టర్ భాను కలిసి మరొక డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఎన్నో వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు.

డైరెక్టర్ హరీష్ శంకర్..

ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి మాట్లాడుతూ మీ పేరు ముందు మాస్ మహారాజ్ (Mass Maharaj)అని ఉంటుంది అయితే ఇప్పుడు ఏకంగా మాస్ పేరుతోనే సినిమా రాబోతుంది అసలు ఈ మాస్ మహా రాజ్ అనే బిరుదు ఎవరిచ్చారు అంటూ ప్రశ్న వేశారు. తాను డాన్ శీను సినిమాకు టైటిల్స్ పడేటప్పుడు మాస్ మహారాజ్ అనే టైటిల్ కార్డు చూశానని వెంకీ అట్లూరి గుర్తు చేసుకున్నారు. ఇక ఈ విషయంపై రవితేజ మాట్లాడుతూ.. తనకు డాన్ శీను సినిమా సమయంలో ఈ బిరుదు రాలేదని, లక్ష్యం సినిమా వేడుకలో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) సుమ గారితో మాట్లాడుతూ నన్ను మాస్ మహారాజా అని పిలవమని చెప్పారు.


పోలీస్ ఆఫీసర్ గా రవితేజ..

ఇలా ఈ సినిమా వేడుకలో సుమ గారు నన్ను పిలిచేటప్పుడు మాస్ మహారాజ రవితేజ అంటూ పిలిచారని అప్పటినుంచి ఈ పేరు నా పక్కన చేరిపోయింది అంటూ రవితేజ మాస్ మహారాజా బిరుదు వెనుక ఉన్న స్టోరీ గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే రవితేజ శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పై మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Related News

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!

Big Stories

×