E-Paper
Advertisement

బండ్లన్న కూతురి ఎంగేజ్మెంట్ రిటర్న్ గిఫ్ట్ చూసారా? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఇక పెళ్లి ఎలా చేస్తాడో?

బండ్లన్న కూతురి ఎంగేజ్మెంట్ రిటర్న్ గిఫ్ట్ చూసారా? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఇక పెళ్లి ఎలా చేస్తాడో?
Advertisement

Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం ఇటీవల ఎంతో అందంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గణేష్ కుమార్తె జనని సూర్య తేజల నిశ్చితార్థపు వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరితో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యి కాబోయే వధువు వరూలను ఆశీర్వదించారు. ఇక సూర్య తేజ జనని నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట అతి త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.

కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బండ్లన్న..

ఇక నిశ్చితార్థపు వేడుకను బండ్ల గణేష్ పెళ్లి తరహాలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల అందరిని కూడా ఆహ్వానించారు. వేడుకకు వచ్చిన వారందరికీ బండ్ల గణేష్ ఖరీదైన కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థానికి వెళ్లినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఇచ్చిన రిటన్ గిఫ్ట్స్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి బండ్లన్న ఇచ్చిన ఆ కాస్ట్లీ గిఫ్ట్ ఏంటి? దాని ధర ఎంత అనే విషయానికి వస్తే..

రూ.5 వేల రిటర్న్ గిఫ్ట్..

Advertisement

బండ్ల గణేష్ జనని నిశ్చితార్థపు వేడుకకు వెళ్ళినటువంటి అతిథులకు బర్గనర్ అనే ఆస్ట్రియా బ్రాండ్ కి సంబంధించిన బిర్యానీ హండి కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఈ రిటర్న్ లో ఒక స్వీట్ బాక్స్ తో పాటు ఒక బ్లౌజ్ పీస్ అలాగే దాదాపు 5 కిలోల బిర్యానీ హండి కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఇలా ఈ కిచన్ వేర్ దాదాపు 5000 రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ఎంగేజ్మెంట్ కోసమే బండ్ల గణేష్ 5000 రూపాయల విలువ చేసే రిటన్ గిఫ్ట్ ఇచ్చారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

పెళ్లి ఏ రేంజ్ లో చేయబోతున్నారు…

Advertisement

?igsh=MXkwZ3oxbzUyaXdqbg%3D%3D

బండ్ల గణేష్ ఎంగేజ్మెంట్ కోసమే ఈ రేంజ్ లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఇక పెళ్లికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? పెళ్లి ఏ రేంజ్ లో చేయబోతున్నారు అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ కు జననితో పాటు మరొక కుమారుడు కూడా ఉన్నారనే విషయం తెలిసిందే. ఇక బండ్ల గణేష్ కాబోయే అల్లుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అనంతరం నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఇటీవల మరో కొత్త బ్యానర్ ప్రకటించారు. మరి ఆ బ్యానర్ లో సినిమాలను ఎప్పుడు చేయబోతున్నారు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

Also Read: దివంగత మాజీ ముఖ్యమంత్రికి పవన్ నివాళులు .. సర్జరీ తర్వాత మొదటిసారి బయటకు!

Related News

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×