E-Paper
Advertisement

జేబుకు చిల్లు పడకుండా.. గదిని ఐస్ ముక్కలా మార్చే.. టాప్-5 ఏసీలు ఇవే భయ్యా!

జేబుకు చిల్లు పడకుండా.. గదిని ఐస్ ముక్కలా మార్చే.. టాప్-5 ఏసీలు ఇవే భయ్యా!
Advertisement

Air Conditioners: తెలుగు రాష్ట్రాల్లో రోజుకు రోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి పెద్ద ఎత్తున ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఏసీలు ఎక్కువ సేపు వాడితే పవర్ బిల్లు అమాంతం పెరుగుతుందన్న భయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో అవసరం ఉన్నప్పటికీ ఏసీ కొనాలంటే కొందరు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ వాటితో పోలిస్తే.. విద్యుత్ భారాగాన్ని సగానికి పైగా తగ్గించే అద్భుతమైన ఏసీలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. మార్కెట్లోని టాప్ – 5 ఫైవ్ స్టార్ రేటింగ్ ఏసీలు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్మార్ట్ ఏసీ

ఈ ఏసీ ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా 5.8 ISEER రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. దీనిలోని ‘ట్రూ ఏఐ’ (True AI) మోడ్ గదిలోని ఉష్ణోగ్రత, గాలి తేమను బట్టి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ‘మ్యాటర్’ (Matter) సపోర్ట్‌తో వస్తున్నందున మీ స్మార్ట్ హోమ్ పరికరాలతో దీనిని సులభంగా కనెక్ట్ చేయవచ్చు.

డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ

Advertisement

ఈ డైకిన్ ఏసీలు.. ‘కోండా ఎయిర్‌ఫ్లో’ (Coanda Airflow) టెక్నాలజీకి బాగా పాపులర్ అయ్యాయి. ఇది చల్లటి గాలిని నేరుగా శరీరానికి తగలనివ్వకుండా గది పైకప్పు వైపుగా పంపి గది మొత్తం సమానంగా విస్తరించేలా చేస్తుంది. దీనిలోని ‘డ్యూ క్లీన్’ (Dew Clean) టెక్నాలజీ ఇండోర్ యూనిట్‌లోని కాయిల్స్‌ను ఆటోమేటిక్‌గా శుభ్రం చేస్తుంది. ఇది 5.2 ISEER రేటింగ్‌తో అత్యంత తక్కువ విద్యుత్తును వాడుకుంటూనే.. 52 డిగ్రీల ఎండలో కూడా అద్భుతమైన కూలింగ్‌ను అందిస్తుంది.

ఎల్‌జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ

దీనిలోని ‘డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్’ వేగంగా గదిని చల్లబరచడమే కాకుండా.. చాలా తక్కువ శబ్దాన్ని చేస్తుంది. ఇందులో ఉన్న 6 ఇన్ 1 కన్వర్టిబుల్ మోడ్ ఉపయోగించి.. ఏసీ సామర్థ్యాన్ని 40% నుండి 110% మధ్య సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల గదిలో తక్కువ మంది ఉన్నప్పుడు విద్యుత్తును మరింతగా ఆదా చేయవచ్చు.

లాయిడ్ స్టెల్లార్ ఆర్ట్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ

Advertisement

మంచి లుకింగ్ తో పాటు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు ఈ లాయిడ్ ఏసీని ట్రై చేయవచ్చు. ఇది సుమారు 5.35 ISEER రేటింగ్‌ను కలిగి ఉంది. ఏడాదికి కేవలం 752 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 15 మీటర్ల దూరం వరకు గాలిని పంపే సామర్థ్యం (Long Air Throw) ఉంది. అలాగే గదిలోని గాలి నాణ్యతను తెలిపే రియల్ టైమ్ CO2 అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: Power Saving Tips: విద్యుత్ బిల్లును అమాంతం పెంచేసే.. ఈ 15 అలవాట్ల గురించి తెలుసా?

వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ వెక్టర్ ఎలైట్

ఈ వోల్టాస్ ఏసీలోని ‘4 ఇన్ 1 అడ్జస్టబుల్ మోడ్’ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ డస్ట్ ఫిల్టర్, యాంటీ-మైక్రోబియల్ కోటింగ్‌ కలిగి ఉంది. ఇది గాలిలోని ధూళిని తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఎనర్జీ సేవింగ్ ఏసీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.

Also Read: Vijay Alliance Buzz: విజయ్‌ను వెంటాడుతోన్న 11.. సింహం సీఎం కావాలంటే, పొత్తే దిక్కు!

Related News

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×