E-Paper
Advertisement

Varanasi Movie: గ్లోబ్‌ ట్రాటర్‌.. మహేష్‌ ఎంట్రీ వెనుక జక్కన్న కష్టం చూశారా? మేకింగ్‌ వీడియో వైరల్‌

Varanasi Movie: గ్లోబ్‌ ట్రాటర్‌.. మహేష్‌ ఎంట్రీ వెనుక జక్కన్న కష్టం చూశారా? మేకింగ్‌ వీడియో వైరల్‌

Globe Trotter Mahesh Intro Making Video: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. యాక్షన్‌ అడ్వెంచర్‌గా పాన్‌ వరల్డ్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. జస్ట్‌ అనౌన్స్‌మెంట్‌తో బజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. రీసెంట్‌గా జరిగిన మెగా ఈవెంట్‌తో విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఫస్ట్‌ లుక్‌, టైటిల్ అనౌన్స్‌మెంట్‌ కోసం కూడా ఈ రేంజ్లో ఈవెంట్‌ జరపోచ్చని ప్రూవ్‌ చేశాడు జక్కన్న.

వేలల్లో హాజరైన అభిమానులు

ఈ మెగా ఈవెంట్‌ని గ్లోబ్‌ ట్రాటర్‌ పేరుతో రామోజీ ఫిల్మ్‌ సిటీలో గ్రాండ్‌ నిర్వహించారు. దీనికి వేలల్లో ఫ్యాన్స్‌ హాజరయ్యారు. భారీ బందోబస్తు, అందరు అగ్ర నటులే.. వేలమంది జనం.. అయినా ఈవెంట్‌లో ఎక్కడ కూడా చిన్న అపశ్రుతి జరగలేదు. అంటే ఈ ఈవెంట్‌ కోసం జక్కన్న అండ్‌ టీం ఎంతగా కష్టపడింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో మీ ఊహాకే తెలియాలి. అన్ని విధాలు ఈ ఈవెంట్‌ సక్సెస్‌ అయ్యింది. ఈ కార్యక్రమంలో మహేష్ ఫస్ట్‌ లుక్‌తో పాటు మూవీకి టైటిల్‌, స్టోరీకి సంబంధించిన చిన్నపాటి ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఇందులో అత్యాథునిక టెక్నాలజీ, అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌ వాడారు. ఇందులో వారణాసి టైటిల్‌, గ్లింప్స్‌ చూసి ఫ్యాన్స్‌ అంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మహేష్‌ ఇంట్రో మేకింగ్‌ వీడియో

ముఖ్యంగా మహేష్‌ ఫస్ట్‌ లుక్‌ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ వెంట్‌లో మొత్తంలో ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ బాగా ఆకట్టుకున్న అంశం స్టేజ్‌పైకి మహేష్‌ ఎంట్రీ. వృషభం (బొమ్మ ఎద్దు)పై కింది నుంచి స్టేజ్‌పైకి ఎంట్రీ ప్లాన్‌ చేశాడు రాజమౌళి. ఈ ఎంట్రీ మామూలుగా లేదు. ఎద్దుపై మహేష్‌ అలా ప్రీన్స్‌లో వస్తుంటే ఫ్యాన్స్‌కి కనులవిందుగా అనిపించింది. దీనికి వచ్చిన ఈళలు, అరుపులు ఆకాశాన్ని తాకాయి. ఈవెంట్ మొత్తంలో హైలెట్‌ నిలిచిన మహేష్‌ ఎంట్రీ కోసం రాజమౌళి అండ్‌ టీం ఎంత కష్టపడిందో తాజాగా వీడియో రిలీజ్ చేశారు. ఈ ఎంట్రీ సీన్‌ మేకింగ్ వీడియోని తాజాగా వారణాసి టీం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది.

జక్కన్న విజన్‌, ప్లానింగ్‌ కి హ్యాట్సాఫ్‌

ఇందులో రాజమౌళి ఎద్దుపై ఎలా రావాలో మొదటి చేసి చూపించాడు. ఆ తర్వాత మహేష్‌ అది చేసి చూపించాడు. దీనికోసం వారణాసి టీం తీసుకున్న జాగ్రత్తలు, చేసిన ఏర్పాట్లు, పడ్డ కష్టం ఈ మేకింగ్‌ వీడియోలో స్పష్టం కనిపించింది. ఇది చూసి ప్రతి ఒక్కరు రాజమౌళి ఆయన టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా జక్కన్న ప్లానింగ్‌, విజన్‌, పద్దతికి హ్యాట్సాఫ్‌ కొడుతున్నారు. ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన వారణాసి టీంని ప్రేక్షకులంత ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఏదో లుక్‌, టైటిల్‌ ఇచ్చామో లేదా అని వదిలేయకుండా ఆడియన్స్‌ ఇష్టాలను, అభిరుచి కోసం టీం ఎంతో కష్టపడిందని, ఇలా ప్రతి ఒక్క డైరెక్టర్‌, మూవీ టీం ఆలోచిస్తే బాగుంటుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: Malavika Mohanan: రాజాసాబ్‌లో ఐదారు సీన్స్‌ మాత్రమే.. ప్రభాస్‌తో యాక్టింగ్‌పై మాళవిక కామెంట్స్!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×