E-Paper
Advertisement

Bellamkonda Sai Sreenivas: ‘రోకా’ వేడుక అనంతరం కావ్య రెడ్డి‌పై హార్ట్ టచ్చింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్

Bellamkonda Sai Sreenivas: ‘రోకా’ వేడుక అనంతరం కావ్య రెడ్డి‌పై హార్ట్ టచ్చింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్
Advertisement

Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ హీరో పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ స్వయంగా శ్రీనివాస్ తన కాబోయే భార్యతో నిశ్చితార్థానికి సిద్ధమయ్యారు. ప్రియురాలితో ‘రోకా’ వేడుక జరుపుకున్న శ్రీనివాస్.. కావ్య రెడ్డితో దిగిన అందమైన ఫోటోను షేర్ చేస్తూ, ఒక హార్ట్ టచింగ్ నోట్ రాసుకొచ్చాడు. ‘‘నా కావ్యమ్మకు..’’ అంటూ మొదలైన ఆ సందేశం ఇప్పుడు అభిమానుల మనసు గెలుచుకుంటోంది. ‘‘జీవితానికి ఒక అందమైన సమయం ఉంటుంది.. ఆ సమయమే నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నన్ను నమ్మినందుకు, నా ప్రతి రోజును పాజిటివిటీతో, చిరునవ్వులతో నింపినందుకు చాలా థాంక్స్. నీ ముఖంపై ఆ నవ్వు ఎప్పటికీ చెదిరిపోకుండా చూసుకునే బాధ్యత నాది. మనం కలిసి చేసే ప్రయాణం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాను’’ అంటూ శ్రీనివాస్ తన ప్రేమను ఎంతో గొప్పగా వ్యక్తపరిచారు.

Also Read- Salaar: డైనోసార్ కోసం నెట్‌ఫ్లిక్స్ వెతుకులాట.. ‘సలార్’ టీమ్ మాస్ రిప్లై!

మీ ప్రేమ, మద్దతు కావాలి

Advertisement

చాలామంది ఈ ఫోటోలు చూసి ఇది నిశ్చితార్థం (Engagement) అని భ్రమపడ్డారు. కానీ శ్రీనివాస్ ఆ విషయంలో క్లారిటీ ఇస్తూ.. ఇది కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక చిన్న ‘రోకా’ వేడుక (Announcement) మాత్రమేనని స్పష్టం చేశాడు. అంటే పెద్దల సమక్షంలో సంబంధం ఖాయం చేసుకునే కార్యక్రమం అన్నమాట. అసలైన వేడుకలు, సందడి ఇంకా మొదలవ్వాల్సి ఉందని, పెళ్లికి సంబంధించిన శుభ ముహూర్తాలను, తేదీలను అతి త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తానని తెలిపారు. ‘మీ అందరి ప్రేమ, మద్దతు నాకు వరల్డ్ సమానం’ అంటూ తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రకటనతో అటు బెల్లంకొండ ఫ్యామిలీలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ సందడి మొదలైంది. కాబోయే జంట ఎంతో చూడముచ్చటగా ఉందంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read- EPIC First Semester: 90స్ సీక్వెల్ ‘ఎపిక్‌’ వీడియో సాంగ్ ‘సంచారమే’.. ఎలా ఉందంటే?

ఆ సినిమాలు పూర్తి చేశాకే..

Advertisement

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న శ్రీనివాస్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త చాప్టర్ మొదలుపెట్టబోతున్నారు. కావ్య రెడ్డితో శ్రీనివాస్ కెమిస్ట్రీ చూస్తుంటే, సినిమాటిక్ లవ్ స్టోరీని తలపిస్తోంది. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ హీరో, రీసెంట్‌గానే ‘కిష్కింధపురి’ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన రెండు ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న శ్రీనివాస్.. ఈ సినిమాలు పూర్తి చేసి అప్పుడు మ్యారేజ్‌పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. చూద్దాం.. ఆ శుభగడియలు ఎప్పుడో?

Also Read- South Cinema: థియేటర్లలో సినిమా మనుగడ కోసం ఫిల్మ్ ఛాంబర్స్ కీలక నిర్ణయం! ఏంటంటే?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×